Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా మొత్తం 80మంది, ధ్యావుడా?

Advertiesment
comments
, సోమవారం, 20 సెప్టెంబరు 2021 (21:54 IST)
తిరుమలలో నూతనంగా ప్రభుత్వం నియమించిన జంబో పాలకమండలిపై సర్వత్రా విమర్సలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు సభ్యులు 24 మంది అయితే ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 56 మందిని ప్రభుత్వం నియమించింది.
 
నామినేటెడ్ పోస్టులు దొరకని వారందరికీ తిరుమలను పునరావాస కేంద్రంగా మార్చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు, స్థానిక బిజెపి నేతలు మండిపడుతున్నారు. పూర్తిగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
 
ఈరోజు ఏకంగా బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం కూడా సమర్పించారు. పాలకమండలి సభ్యుల నియామకం సరైంది కాదన్నారు. అయితే ప్రభుత్వం నియమించిన సభ్యులు మాత్రం ఒక్కొక్కరు.. ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేస్తూనే ఉన్నారు. ఏమాత్రం విమర్సలను పట్టించుకోకుండా జంబో పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం విమర్సలకు తావిస్తోంది.
 
ఇప్పటికే సుమారుగా 15 మందికి పైగా సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన వారు ప్రతిరోజు ఇద్దరేసి చొప్పున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ లెక్కన 80 మంది సభ్యులకు 80 మంది అటెండర్లు, 80 ఆఫీసులు, 80 టిటిడి కార్లు.. 80 మందికి ప్రతిరోజు ప్రత్యేక ప్రవేశా దర్సనా టిక్కెట్ల కేటాయింపు.
 
ఇలా ఈ సభ్యులకు టిక్కెట్లన్నీ ఇచ్చేస్తే ఇక సాధారణ భక్తుల పరిస్థితి ఏంటని టిటిడి ప్రశ్నిస్తోంది. ఇన్ని విమర్సలు వస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు సరికదా విమర్సలను పూర్తిగా పక్కనబెట్టేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

DHL ఎక్స్‌ప్రెస్ భారతదేశంలో 2022 వార్షిక ధరల సర్దుబాట్లను ప్రకటించింది