Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

Advertiesment
byreddy sabari

ఠాగూర్

, బుధవారం, 2 జులై 2025 (17:05 IST)
చిల్లర రాజకీయాల పేరుతో పాదయాత్ర అంటూ వస్తే ప్రజలే చెప్పుతో కొడతారని వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎంపీ  బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైకాపా రౌడీ రాజకీయాలన ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. 
 
గడిచిన ఐదేళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలి. అది చేయకుండా చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే ప్రజలే చెప్పులతో కొడతారు అని ఆమె జగన్‌ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
జగన్ ఐదేళ్ల పాలనలో చేయలేని అభివృద్ధిని తమ కూటమి ప్రభుత్వం యేడాది కాలంలోనే చేసి చూపించిందని శబరి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నామని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని ఆమె తెలిపారు. పనిలోపనిగా వైకాపా విధి విధానాలపై, జగన్‌పై విమర్శలు గుప్పించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్య తరగతి ప్రజలపై జీఎస్టీ భారం తగ్గింపుపై దృష్టి?