నెల్లూరు జిల్లా పడుగుపాడు వద్ద వరద నీటికి కొట్టుకునిపోయిన రైల్వే ట్రాక్‌ను దక్షిణ మధ్య రైల్వే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసింది. దీంతో ఈ మార్గంలో నడిచే రైళ్లను దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. తాజాగా మరో ఆరు రైళ్లను పునరుద్ధరించారు.
వీటిలో తిరుపతి - హజరత్ నిజాముద్దీన్ (నంబరు 12707), చెన్నై సెంట్రల్ - ముంబై సెంట్రల్ (22160), ముంబై - చెన్నై సెంట్రల్ (22159), చెన్నై సెంట్రల్ - ముంబై ఎల్టీటీ (12164), ముంబై ఎల్టీటీ - చెన్నై సెంట్రల్ 12463) రైళ్లు యధావిధిగా నడుస్తాయని దక్షిణ మధ్యరైల్వే పేర్కొంది.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, కడప జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. ఈ వరద నీటి ప్రవాహానికి అనేక రహదారులు, పలు ప్రాంతాల్లో రైలు కట్టలు ధ్వంసమయ్యాయి. వీటీకి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు.