రూ.16 వందల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా శిధిలావస్థలో ఉన్న హాస్పిటల్స్ పునర్ నిర్మిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు
స్వాతంత్ర అనంతరం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైద్య రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పటల్‌లో అదమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌ను కొడాలి నాని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గ్రామ స్థాయి నుండే 24 గంటలు ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.
అదమా లాంటి సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.