Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిగ్గులేని చంద్ర‌బాబు...వాళ్ళ పిల్ల‌ల్ని ఎక్క‌డ చదివించారు?

Advertiesment
minister
విజయవాడ , సోమవారం, 16 ఆగస్టు 2021 (15:15 IST)
ఏపీలో ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని ఈ మ‌ధ్య కాలంలో కొంత సైలెంట్ గా ఉన్నారు. దీనితో ఆయ‌న‌లో ఫైర్ అయిపోయింద‌ని ప్ర‌తిప‌క్షాలే కాదు... స్వ‌ప‌క్షంలోనూ విమ‌ర్శ‌లు, గుస‌గుస‌లు వ‌చ్చాయి. ఆ అపప్ర‌ద లేకుండా, మ‌ళ్లీ త‌న‌దైన శైలిలో మంత్రి కొడాలి నాని ఫైరింగ్ తిరిగి ప్రారంభించారు.

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుతోపాటు ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, రామోజీరావు... ఇలా అంద‌రిపై విరుచుకుప‌డ్డారు. ప్రభుత్వ స్కూల్ లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే... తెలుగు భాషను జగన్మోహనరెడ్డి నాశనం చేస్తున్నాడని అన్నారు...14 సంవత్సరాలు పాలన చేసిన సిగ్గులేని చంద్రబాబునాయుడు ఇంకా విమ‌ర్శిస్తాడు... ఆయ‌న‌తోపాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఈనాడు రామోజీ నాయుడు, రాధాకృష్ణ... మరి వీళ్లందరూ వారి పిల్లలను ఏ స్కూళ్లలో చదివించుకున్నారని ప్రశ్నించారు.

కృష్ణా జిల్లా నందిగామలో మొదటి దశ మనబడి నాడు - నేడు పాఠశాలలను ప్రజలకు అంకితం చేశారు. మ‌లి విడ‌త మన బడి నాడు- నేడు పనులు ప్రారంభం అయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు పాల్గొన్నారు. పాఠ‌శాల విద్యార్థుల‌కు జగనన్న విద్యా కానుక పంపిణీని ఆయ‌న ముఖ్య అతిథిగా ప్రారంభించారు.

ప్రభుత్వ స్కూల్ లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే, ప్ర‌తిప‌క్ష నేత‌లు విమ‌ర్శించార‌ని, ఇపుడు సీఎం అదే కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగిస్తున్నార‌ని మంత్రి చెప్పారు. చంద్ర‌బాబుకు సిగ్గులేద‌ని, తెలుగు భాష‌కు ఆయ‌న చేసింది ఏమీ లేదన్నారు. ఇంకా సిగ్గులేకుండా ఇంగ్లిష్ మీడియంపై జ‌గ‌న్ పై విమ‌ర్శలు చేస్తాడ‌ని ఆరోపించారు.

నందిగామ నాడు నేడులో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ జె. నివాస్, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఏపీ ఫారెస్ట్ డవలప్మెంట్ ఛైర్మన్ యం. అరుణ్ కుమార్, మునిసిపల్ ఛైర్మన్ యం. వరలక్ష్మీ , జాయింట్ క‌లెక్ట‌ర్ ఎల్.శివశంకర్, సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్, డీఈఓ తాహేరా సుల్తానా, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాలిబన్లతో స్నేహానికి తహతహలాడుతున్న చైనా - రష్యా ఆందోళన