Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్యాగమూర్తి అటల్ బిహారీ వాజ్‌పేయి : పవన్ కళ్యాణ్

Advertiesment
pawan kalyan
, బుధవారం, 16 ఆగస్టు 2023 (14:06 IST)
మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టిన రోజును పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. త్యాగమూర్తి ఏబీ వాజ్‌పేయి అంటూ కొనియాడారు. ఇదే విషయంపై ఆయన తన సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. 
 
"దేశం కోసమే పుట్టిన మహానుభావులు ఎందరో.. అటువంటి వారిలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే వందలు వేలకోట్ల ఆస్తులను సంపాదించే రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజులలో మూడుసార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పని చేసినప్పటికీ చరమాంకంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహంలోనే తనువు చాలించిన వాజ్‌పేయి గురించి ఏమని చెప్పాలి. అందుకేనేమో ఆయన భారతరత్నగా మనందరి గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు. 
 
విద్యార్థి దశలోనే స్వాతంత్ర్యం ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని చవిచూసిన వాజ్‌పేయి దేశమే జీవితం అనుకొని బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. హిందీ, సంస్కృతం, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించిన ఆయన పాత్రికేయునిగా పని చేస్తూనే రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆయన నిర్వర్తించిన పదవులు ఎన్నో. జనతా ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా తన ప్రతిభను చాటుకున్నారు. పార్లమెంటేరియన్‌గా ఆయన సుదీర్ఘంగా పని చేశారు. 
 
బిజెపీ అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రిగా ఆయన హయాంలో మన దేశం ఎన్నో విజయాలను చవిచూసింది. రాజస్థాన్ ఎడారిలో అణుపరీక్షలు జరిపి భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా నిలిపింది ఆయనే. ప్రైవేటు రంగాన్ని పటిష్టపరచటం, దేశంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ రోడ్డు రవాణా వ్యవస్థను విస్తరించటం ఆయన సాధించిన విజయాలే. ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే ఆయన వాగ్దాటి పార్లమెంటును అబ్బురపరిచేది. విలక్షణమైన ఆయన కవితా ఝరి పామరులను సైతం ఆకట్టుకునేది. ఇంతటి అరుదైన నాయకుడి వర్ధంతి సందర్భాన ఆ మహా నాయకునికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. నా పక్షాన, జనసేన పక్షాన నివాళులు అర్పిస్తున్నాను" అని పవన్ తన సందేశంలో పేర్కొన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాపింగ్ కార్ట్‌లో ఆరు అడుగులు కొండచిలువ