Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీళ్ళకు పోయేకాలం దగ్గరపడింది.. శ్రీవారితో జగన్‌ను పోల్చుతారా? ఆర్ఆర్ఆర్ ఫైర్

raghuramaraju
, బుధవారం, 16 ఆగస్టు 2023 (12:54 IST)
ఏపీలోని అధికార వైకాపా నేతలు అధికార మదంతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారని, వీరికి పోయేకాలం దగ్గరపడిందని ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. సీఎం జగన్‌ను కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామితో పోల్చుతారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రుషికొండపై జగన్ భవనాన్ని తిరుమల కొండపై ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, శ్రీశైలం కొండపై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంతో పోల్చడం సిగ్గుచేటన్నారు. మనిషి అనేవాడు ఇలా వ్యాఖ్యానించరన్నారు. 
 
విశాఖలోని రుషికొండకు గుండు కొట్టించి, అక్రమంగా ఇల్లు కట్టుకున్న వ్యక్తిని మంత్రులు దేవుడితో పోల్చడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 
 
టూరిజం కాటేజీల ముసుగులో జగన్ కట్టుకుంటున్న అక్రమ భవనం సీఆర్‌జెడ్ జోన్ పరిధిలోకి వస్తుందని... ఈ జోన్‌లో కొన్ని నిబంధనలు ఉంటాయన్న కనీస అవగాహన కూడా మంత్రులకు లేదని ఎద్దేవా చేశారు. మంత్రులకు మతి పోయినట్టు ఉన్నారు. కొండపై కట్టిన నాలుగు బ్లాకులకు 4 పేర్లు పెట్టారని రఘురాజు తెలిపారు. 
 
వీటిలో సీఎం నివాస సముదాయం, క్యాంపు కార్యాలయం, కార్యదర్శుల కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలను నమ్మించే కుట్ర చేస్తున్నారని అన్నారు. టూరిజం కాటేజీల ముసుగులో నిర్మించుకున్న ఈ అక్రమ భవానాలను కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం కూల్చి వేయాలని చెప్పారు. ఈ భవనాల నిర్మాణాలకు వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ఇకలేరు...