Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిమ్మగడ్డ గెలిచారు, ఆ అధికారుల పనైపోయింది.. ఎవరు వారు..?

Advertiesment
నిమ్మగడ్డ గెలిచారు, ఆ అధికారుల పనైపోయింది.. ఎవరు వారు..?
, సోమవారం, 25 జనవరి 2021 (22:24 IST)
పంచాయతీ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా ఎన్నికల కమిషనర్‌గా ఆయన తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రరాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. అదే సమయంలో తీవ్ర చర్చకు దారితీసింది. 
 
హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎన్నికలు జరపాలన్న తీర్పే వచ్చింది. దీంతో నిమ్మగడ్డ గతంలో ఎవరైతే కొంతమంది అధికారులను బదిలీ చేశారో.. వారి బదిలీలను ప్రభుత్వం మళ్ళీ ఆపి అదే పదవిలో కొనసాగించింది. కానీ ఇప్పుడు మళ్ళీ వారిని బదిలీ చేయడం తప్ప ప్రభుత్వానికి వేరే ఆల్టర్నేట్ లేకుండా పోయింది.
 
అందులో ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు చెందిన కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్త, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, శ్రీకాళహస్తి, పుంగనూరు, పలమనేరులకు చెందిన డిఎస్పీలు. గతంలో ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వీరు విధులను సక్రమంగా నిర్వర్తించలేదని ఇసికి ఫిర్యాదు వెళ్ళడంతో చివరకు వారిని బదిలీ చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం వారిని బదిలీ చేయకుండా అదే స్థానంలో ఉంచింది.
 
ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఇక ఎన్నికలు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కలెక్టర్‌తో సహా మిగిలిన అధికారులు బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్థమైంది. చిత్తూరు జిల్లానే కాకుండా గుంటూరు జిల్లా కలెక్టర్, ప్రధానంగా పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలక్రిష్ణ, కమిషనర్ గిరీజా ప్రసాద్ పైన కూడా బదిలీ వేటు పడనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడపను చూస్తే ఆశ్చర్యపోతారు, ఎందుకని?