Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో పంచాయతీ పోరు : నేడు తొలి దశ నోటిఫికేషన్

Advertiesment
ఏపీలో పంచాయతీ పోరు : నేడు తొలి దశ నోటిఫికేషన్
, శనివారం, 23 జనవరి 2021 (07:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా, తొలి దశ కోసం నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వెల్లడించారు. తొలి విడతలో 11 జిల్లాలకు సంబంధించి ఒక్కో డివిజన్‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ విడతలో గుంటూరు, చిత్తూరు జిల్లాలను మినహాయించారు. 
 
నిజానికి ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఏపీ సర్కారు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇదే అంశంపై ఏపీ సర్కారు, ఎస్ఈసీకి మధ్య హైడ్రామా నడించింది. ఓ వైపు వ్యాక్సినేషన్, మరోవైపు ఎన్నికలు సాధ్యం కావని, కాబట్టి నోటిఫికేషన్ వాయిదా వేయాలని ప్రభుత్వం కోరింది. 
 
అయినప్పటికీ ఎన్నికల నిర్వహణకే రమేశ్ కుమార్ మొగ్గు చూపుతున్నారు. గత మార్చిలో ఎన్నికల ప్రక్రియ సందర్భంగా అక్రమాలను, హింసను నివారించడంలో విఫలమయ్యారన్న కారణంతో 9 మంది అధికారులను నిమ్మగడ్డ విధుల నుంచి తప్పించారు.
 
నోటిఫికేషన్ విడుదల కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌లకు నిమ్మగడ్డ లేఖలు రాశారు. 
 
అయితే, నిమ్మగడ్డ లేఖను వారు పట్టించుకోలేదు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు పంచాయతీ, పోలీసు అధికారులు, సంబంధిత అధికారులతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 
 
మరోవైపు ఈ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. కానీ, దీనిపై స్పష్టత ఇవ్వలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరేశారు.. మృతి.. నెటిజన్ల ఫైర్.. ఎక్కడ?