Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినిమా అన్ లైన్ టిక్కెట్ల‌తో బ్లాక్ మార్కెట్, ప‌న్ను ఎగ‌వేత‌కు చెక్

సినిమా అన్ లైన్ టిక్కెట్ల‌తో బ్లాక్ మార్కెట్, ప‌న్ను ఎగ‌వేత‌కు చెక్
విజయవాడ , బుధవారం, 15 సెప్టెంబరు 2021 (14:32 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీ. ఓ.ఎం.ఎస్.నంబర్ 35 లో సినిమా టిక్కెట్లు ను ఆన్లైన్ ద్వారా అమ్మకం చేయ‌డానికి ఒక నిర్ణయం తీసుకొని గవర్నర్ రాజముద్ర తో  ఒక జీ. ఓ.ను విడుదల చేయటం జరిగింది. ఆ జీ. ఓ.లో ఒక బ్లూ ప్రింట్ ను విడుదల చేసేందుకు ఒక కమిటీ ని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ ఆన్లైన్ టికెట్స్ అమ్మే నిర్వహణ ను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అభివృద్ధి సంస్థ నిర్వహించనున్నట్టు తెలిపారు.
 
కానీ నిన్న మంత్రి పేర్ని నాని ఈ సినిమా టిక్కెట్స్ ఆన్లైన్ అమ్మకాలపై ఒక నిర్ణయం ఇంకా తీసుకోలేదని, ఒక కమిటీ వేసినట్లు తెలిపారు. ప్రభుత్వ జీ. ఓ.కి, మంత్రి ప్రకటనకు పొంతన లేకుండా ఉందని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్పందించారు. 
 
మంత్రికి సంబంధం లేకుండా ఈ జీ. ఓ.ను ప్రభుత్వం విడుదల చేసిందా అని ప్రశ్నించారు. జీ. ఓ.లో  చాలా స్పష్టతగా నిర్ణయం తీసుకొన్నట్టు తెలుపుతుందని, నిర్వహణ తదితర అంశాల పై ఒక నిర్ణయం తీసుకోడానికి ఒక చైర్మన్ తో పాటు సభ్యులను నిర్ణయించిన తర్వాత ఇప్పుడు మంత్రి ప్రకటన చేయ‌డం  చిత్ర పరిశ్రమని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టిందని చెప్పారు. ప్రభుత్వలు ప్రజల బాగు కోసం పనిచేయలే కానీ, ఎవ్వరో కొంత మంది  వ్య‌క్తుల కోసం కాదని, ఈ ఆన్లైన్ టిక్కెట్ అమ్మకం వలన అటు ప్రజలకు, పరిశ్రమకు, ప్రభుత్వానికి ఏంతో మేలని ఒక పక్క మంత్రి తన మాటల్లో చైపుతూనే, ఇంకా ఈ నిర్ణయం 2002 నుండి జరుగుతోంద‌న్నారు. అప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్ అంత వాడుకలో లేదని. ప్రస్తుతం అది ఎక్కువ వాడుకలో ఉందని అన్నారు.
 
 
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ, పక్కనున్న రాష్ట్రాల సినీ పెద్ద‌లు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాల‌ను ఈ ఆన్లైన్ టిక్కెటింగ్ విధానం కోసం డిమాండ్ చేస్తున్నరని కేతిరెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ పోర్టల్‌లో మాత్రమే విక్రయించా లనుకుంటు తీసుకొన్న నిర్ణయం గొప్పదని, పరిశ్రమ అభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందన్న విషయాన్ని మంత్రి గమనించాల‌న్నారు. 
 
ఈ ఆన్లైన్ అమ్మకాలపై ఇబ్బందులు ఉంటే. కొంతమంది హీరోలకు మాత్రమే కాదని, అందరూ హీరోలకు వర్తిస్తుందని, ఇది ప్రజా దోపిడీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొన్న సాహసోపేత నిర్ణయమని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు.
 
ఆన్లైన్ లో సినిమా టికెట్స్ అమ్మకం వలన విచ్చల విడి బ్లాక్ మార్కెటింగ్. టాక్స్ లు కట్టకుండా ఉండే తతంగం, ఇష్టా రాజ్యంగా సినిమాలను ప్రదర్శించుకోవటనికి గండి పడుతుందని, పీద్ద హీరోల చిత్రాల‌ను  చూడలనుకొనే సగటు ప్రేక్షకుడు అధిక ధరలను చెల్లించి సినిమాలు చూడవలసిన అవసరం ఇక ఉండదన్నారు. హీరో ల పారితోషికం భారీగా తగ్గ‌డానికి, నిర్మాణ ఖర్చులు భారీగా  తగ్గ‌డానికి ఈ నిర్ణయం పరిశ్రమ మేలుకు ఉపయోగపడుతుందన్నారు. చిత్ర నిర్మాణాలు కూడా పెరుగుటకు అవకాశం ఉంటుందని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మంత్రి తన ప్రకటన ను  మార్చుకోవాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆప్ఘాన్‌ కల్చర్‌: మహిళలు నల్లటి బుర్ఖాలు ధరించారు.. ఆన్‌లైన్‌లో ఉద్యమం