హైదరాబాద్ నగరంలోని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మమ్మపై మనవడు లైంగికదాడికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను తెలుసుకుందాం.
తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఎంకమ్మ(80) భర్త మృతి చెందడంతో బీ.సెక్షన్లో ఉంటున్న తన తన కుమార్తె కౌసల్య ఇంట్లో నివశిస్తోంది. కౌసల్యకు గణేష్, రఘు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, చిన్న కొడుకు రఘు మద్యం సేవించే అలవాటు ఉంది. పైగా, జులాయిగా తిరుగుతున్నాడు.
ఈ క్రమంలో గురువారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రఘు ఇంట్లో నిద్రిస్తున్న ఎంకమ్మపై లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు రఘుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రఘుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.