Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడే యముడు... వీడిన టెక్కీ లావణ్య మర్డర్ కేసు మిస్టరీ

Advertiesment
ప్రియుడే యముడు... వీడిన టెక్కీ లావణ్య మర్డర్ కేసు మిస్టరీ
, ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (18:34 IST)
హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లావణ్య హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. లావణ్యను ఆమె ప్రియుడు సునీల్ కుమార్ హత్య చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం ప్రియుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సురేంద్ర నగర్‌కు చెందిన సునీల్ కుమార్ అదే ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని లావణ్య అనే యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో తనను పెళ్ళి చేసుకోవాలని లావణ్య సురేంద్రను ఒత్తిడి చేసింది. దీంతో ఆమెను వదిలించుకునేందుకు ఓ ప్లాన్ వేసింది. రెండు రోజుల క్రితం మాట్లాడుకుందామని చెప్పి సునీల్ లాడ్జ్‌కు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన లావణ్యను అతికిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టి సురారంలోని కాలువలో పడేశారు. 
 
రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన లావణ్య తిరిగి రావకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న ఆర్.సి.పురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఆమె ప్రియుడు సురేంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో టెక్కీ లావణ్య హత్య కేసులోని మిస్టరీ వీడినట్టయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చీరకట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఎందుకంటే?