Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చీరకట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఎందుకంటే?

Advertiesment
చీరకట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఎందుకంటే?
, ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (15:39 IST)
చీర కట్టుకుని ఓ కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజ్ హాస్టల్‌లో వుంటున్న ఓ విద్యార్థి అమ్మాయిగా మారాలనుకున్నాడు. దీంతో తోటి విద్యార్థులు ఆ యువకుడితో మాట్లాడటం మానేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు చీరకట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఎబిన్ రాబర్ట్.. మేట్టుపాళయానికి సమీపంలోని మత్తంపాళ్యంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కొన్ని నెలల క్రితం నుంచే ఎబిన్ రాబర్ట్‌కు అమ్మాయిగా మారాలనే ఆశతో వున్నాడు. కానీ ఎబిన్‌ను స్నేహితులు పక్కనబెట్టారు. 
 
దీంతో మనస్తాపానికి గురైన ఎబిన్ శనివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మే 23న రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకి పట్టాభిషేకం.. బుద్ధా వెంకన్న