Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త కోసం రోడ్డుపై పరుగెత్తిన భార్య, ఇంకో మహిళతో వెళ్ళిపోయిన భర్త, తండ్రి వద్దంటూ కూతురు

Advertiesment
Husband
, గురువారం, 23 జులై 2020 (22:31 IST)
పోలీసులు తనకు న్యాయం చేయడం లేదంటూ తిరుపతిలో ఓ మహిళ, పోలీస్టేషన్ ఎదుట రోడ్డుపై కన్నబిడ్డతో సహా కూర్చుని న్యాయం కోసం పోరాటం చేసింది. మండుటెండలో గాంధీ విగ్రహం ముందు కూర్చుని న్యాయం కావాలంటూ బోరున విలపించింది. కానీ భర్త మాత్రం వేరొక మహిళను మోటారు బండిపై ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
 
మహిళ బోరున విలపిస్తూ ఉండగా కూతురు తల్లిని ఓదారుస్తూ అమ్మ నాకు తండ్రి వద్దు ఆ ఫోనులో డాడీ ఫోటోలు, నెంబర్ డిలీట్ చేసేయ్ అంటూ ఆ చిన్నారి కూడా రోడ్డుపై ఏడుస్తూ కనిపించడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. 
 
తిరుపతిలో నివాసముంటున్న వెంకటాచలం, సరస్వతిలు 13 యేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక వెంకటాచలం మరో మహిళకు దగ్గరయ్యాడు. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. భర్త ప్రవర్తనతో విసుగుచెందిన మహిళ ఈస్ట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది.
 
కానీ పోలీసులు ఉదయం నుంచి ఫిర్యాదు తీసుకోకుండా కాలయాపన చేయడంతో మహిళ ఆవేదనతో రోడ్డుపై నిరసనకు కూర్చుంది. ఆమె భర్త కూడా రెండో భార్యను తీసుకుని స్టేషన్‌కు రావడంతో ఆగ్రహించిన మహిళ సరస్వతి అతనితో గొడవకు దిగింది. దీంతో ఆమె భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. నడిరోడ్డుపై మహిళ న్యాయం కోసం పోలీస్టేషన్ ఎదుట బైఠాయించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. న్యాయం కావాలంటూ మహిళ, ఎస్పీని ఆశ్రయించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్‌తో ఆగిన పెళ్లి.. తెలంగాణలో ఒకే రోజు 1,567 కేసులు