తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగాయి. వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
వడగాలులు వీచే అవకాశం వుండటంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించింది.కడప, నంద్యాల, ఎన్టీఆర్, అనకాపల్లి, శ్రీకాకుళం, పల్నాడు జిల్లాల్లో వడగాలులు వీచాయి.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో నిన్న అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా మాచర్లలో 44.7, ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.