Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చింతనలేని చింతమడకగా తీర్చిదిద్దుతా... పుట్టిన ఊరిలో కేసీఆర్

Advertiesment
చింతనలేని చింతమడకగా తీర్చిదిద్దుతా... పుట్టిన ఊరిలో కేసీఆర్
, సోమవారం, 22 జులై 2019 (17:05 IST)
పుట్టి పెరిగిన ఊరును పునర్నిర్మాణం చేసేందుకు చింతలేని చింతమడకగా తీర్చిదిద్దేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు గ్రామ ప్రజలందరూ ఉప్పొంగిన గుండెలతో, ఉత్సాహంగా స్వాగతం తెలిపారని తెరాస నేత టి. హరీష్ రావు అన్నారు. 
 
ఆయనను చిన్నప్పటి నుంచి చూసినవాళ్ళు, చిన్ననాటి దోస్తులు ఎవరెవరైతే ప్రేమతో ఈ సమావేశానికి విచ్చేసినారో వారందరికీ, గౌరవ ముఖ్యమంత్రికి సిద్ధిపేట శాసన సభ్యునిగా నేను సాదరంగా స్వాగతం పలుకుతున్నా. "జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" అన్నారు పెద్దలు. ఉన్నఊరు కన్నతల్లి స్వర్గంకన్నా మిన్న 
 
మీ అందరి ప్రేమను పంచుకొని యావత్ రాష్ట్రం సాదించడం మనందరికీ గర్వకారణం. అందరికి ఊరు గుర్తింపు తెస్తే... మన ఊరికి మన రాష్ట్రానికీ గుర్తింపు తెచ్చిండు మన కే.సి.అర్. మీది ఏ ఊరు అంటే సంగారేడ్దో, సిద్దిపెటనో అంటారు. కానీ మాది కే.సి.అర్. ఊరు అని గర్వంగా చెప్పుకుంటారు చింతమడక ప్రజలు.
 
ఉద్యమ కాలంలో అడుగడుగునా ఈ గడ్డ అండగా నిలిచింది ఈ చింత మడక గ్రామం. నిమ్స్‌లో నిరాహార దీక్ష చేసేటప్పుడు చింత మడక చిన్నబోయింది. ప్రజాలంతా టి.వి.ల ముందు కూర్చొని మిమ్మల్ని చూస్తూ కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నారు. ఒక్క ఇంట్లో పొయ్యి వేలుగలేదు. ఎవరి నోట్ల అన్నం ముద్దా పోలేదు. 
 
కేసీఆర్ ఆశీర్వాదంతో ఈ గడ్డకు ఎంఎల్‌ఏ సేవచేసే అదృష్టం రావడం పూర్వజన్మ సుకృతంగా బావిస్తున్నాను. ఈ గ్రామములో ప్రతి ఇంచు మీకు తెలియంది కాదు గ్రామంలో జరిగిన ప్రతి అభివృద్ధి మీ కనుసన్నల్లో జరిగినదే. నాడు జన్మభూమిలో స్వంత ఇంటిని ఊరి బడికి రాఘవరావు - వెంకటమ్మల పేరుతొ మీరు ఇచ్చిన స్పూర్తి గొప్పది.
 
మీ ఆశీర్వాదంతో గత కొన్ని సంవత్సరాలుగా గ్రామములో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల దవఖానా, బ్యాంక్, సిద్ధిపేట దుబ్బాక డబుల్ రోడ్డు, పాఠశాల నిర్మాణం ఇలా కొన్ని పనులు చేసుకున్నాం. గ్రామ అభివృద్ధిపై, నియోజకవర్గ అభివృద్ధిపై నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నతల్లిని వేధించిన కొడుక్కి జైలుశిక్ష : మల్కాజిగిరి కోర్టు తీర్పు