Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేటీఆర్ గన్‌మెన్ బెదిరించాడు.. కోవర్టుగా మారిపొమన్నాడు: జెరూసలేం మత్తయ్య

ఓటుకు నోటు కేసును పునఃసమీక్షించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కీలక సూత్రధారి జెరూసలెం మత్తయ్య ధన్యవాదాలు తెలిపారు. అయితే ఓటుకు నోటు కేసులో తనను కోవర్టుగా మార్చేందుకు మంత్రి కేటీఆర్ గన్ మెన్

Advertiesment
Cash for Vote scam
, బుధవారం, 9 మే 2018 (12:33 IST)
ఓటుకు నోటు కేసును పునఃసమీక్షించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కీలక సూత్రధారి జెరూసలెం మత్తయ్య ధన్యవాదాలు తెలిపారు. అయితే ఓటుకు నోటు కేసులో తనను కోవర్టుగా మార్చేందుకు మంత్రి కేటీఆర్ గన్ మెన్ యత్నించారని... తాను దానికి ఒప్పుకోకపోతే బెదిరించారని చెప్పారు. తనపై కొట్టేసిన కేసును మళ్లీ ఓపెన్ చేయాలని.. వాస్తవాలేంటో తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
ఓటుకు నోటు కేసుపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలన్నారు. తన తమ్ముడి బంధువులను కూడా కొట్టించారని... దానిపై కూడా విచారణ జరిపించాలని అడిగారు. క్రిస్టియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ను ఎందుకు బలిపశువు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఓట్లు అడిగిన ఎమ్మెల్యేలందరి ఫోన్ కాల్స్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుట్రపూరితంగా కేసు పెట్టించి, తనను ఏ4గా చేర్చారని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా జిమ్మిబాబును తప్పించి తన పేరును తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ పరీక్ష పాస్ అయితే రూ.లక్ష బహుమతి.. ఎక్కడ?