ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్టియర్ ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులోభాగంగా, ఈ నెల 20 తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 27 నుంచి జూలై 20వ తేదీ వరకు అడ్మిషన్లు చేపట్టి, జూలై ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా షెడ్యూల్ రిలీజ్ చేసింది.
ఈ షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో తొలి యేడాది ప్రవేశాలు చేపట్టాలని పేర్కొంది. కాగా, ఈ నెల మొదటి వారంలో విడుదలైన ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 4.14 లక్షల మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మొత్తం 6.15 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 67.26 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.