Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆదివారం నుంచి మంగళవారం వరకు వాన బాదుడే బాదుడు

ఆదివారం నుంచి మంగళవారం వరకు వాన బాదుడే బాదుడు
, శనివారం, 11 సెప్టెంబరు 2021 (23:07 IST)
ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతం. ఈ ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం.
 
తదుపరి 48 గంటల్లో  బలపడి వాయుగుండంగా మారే అవకాశం. దీని ప్రభావంతో రాగల 4 రోజులు పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55- 65 కీమీ వేగంతో గాలులు.
 
ఆ తీరం వెంబడి మత్స్యకారులు ఆదివారం నుంచి మంగళవారం వరకు వేటకు వెళ్ళరాదు.
రాగల 4 రోజుల వాతావరణ సమాచారం:-
 
శనివారం(11-09-2021):-
శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం.
 
ఆదివారం(12-09-2021):-
శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం.
 
సోమవారం(13-09-2021):-
శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం.
 
మంగళవారం(14-09-2021):-
 శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు , మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Corona: దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు, మరణాలు ఎన్నంటే..