Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Advertiesment
Drowsiness

సెల్వి

, బుధవారం, 2 జులై 2025 (17:55 IST)
Drowsiness
వర్షాకాలం చాలామందిని సోమరితనం ఆవహిస్తుంది. చురుకుగా పనిచేద్దామనుకుంటే నిద్ర ముంచుకొస్తుంది. బయట వాతావరణం హాయిగా చల్లగా వుండటంతో హాయిగా రెస్ట్ తీసుకుందామని చాలామందికి అనిపిస్తుంది. అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. 
 
ఇంటిని లేదా మీరున్న ప్రాంతాన్ని ఎప్పుడూ వెలుతురుగా వుంచండి. వెలుతురు లేమి కారణంగా నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. ఈ హార్మోన్ల కారణంగా సోమరితనం.. మందంగా వుండటం చేస్తుంది. అందుకే ఈ హార్మోన్ల స్థాయిలు పగటి పూట పెరగకుండా వుండాలంటే.. చాలామటుకు పరిసర ప్రాంతాలలో వెలుతురు వుండేట్లు చూడాలి. 
 
అలాగే వర్షం పడుతుంటే.. ఆగిన తర్వాత బయట అలా గడిపి రండి. ఇది శరీరాన్ని క్రమబద్ధీకరిస్తుంది. చురుకుగా వుండేలా చేస్తుంది. డాబా, బాల్కనీలో కొన్ని నిమిషాలు అలా తిరిగి రండి. వర్షాకాలం చలి హ్యాపీగా నిద్రపోవాలనిపించేలా చేస్తుంది. అయితే శారీరక శ్రమ వర్షాకాలంలో అవసరం. 
 
శారీరక శ్రమ లేకుంటే సోమరితనం తప్పదు. అందుకే వర్షాకాలంలో ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు, యోగా చేయాలి. అలాగే ఇంటిని శుభ్రపరచడం, డెకరేషన్స్ చేయడం వంటి పనులు చేయొచ్చు. ఇంటి మెట్లను ఎక్కి దిగడం, డ్యాన్స్ చేయడం వంటి 15-20 నిమిషాల పాటు చేస్తే సరిపోతుంది. 
 
అలాగే వర్షాకాలంలో తీసుకునే ఆహారంలో జాగ్రత్త చాలా అవసరం. నూనె పదార్థాలను దూరం వుంచడం చేయాలి. అజీర్ణ సమస్యలను దూరం చేసుకోవాలంటే నూనె పదార్థాలను దూరం చేస్తాయి. దానికి బదులుగా కూరగాయల సూప్, పప్పు రకాలు, పండ్లు, సాలడ్స్, కూరగాయలు వంటివి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అలసటను దూరం చేస్తుంది. సూప్స్ వంటివి తీసుకోవాలి.
 
లెమన్, పుదీనా, రోస్మేరీ వంటి వాసనలను వాడటం మంచిది. వర్షం కారణంగా ఇంటి కిటికీలను లోపలికి వచ్చేలా చేస్తుంది. వేడి నీటితో లేదా చన్నీళ్లతో అప్పుడప్పడు ముఖానికి కడుగుతూ వుండాలి. అలసటగా భావిస్తే.. అరగంట పాటు నిద్రపోవచ్చు. రాత్రి పూట 7-8 గంటల నిద్ర తప్పనిసరి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?