Publish Date: Tue, 22 Feb 2022 (23:47 IST)
Updated Date: Wed, 23 Feb 2022 (22:40 IST)
కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చునే ఉద్యోగాల్లో ఉన్న మహిళలు తప్పకుండా వ్యాయామం చేయాలి. లేకుంటే.. కీళ్ళ నొప్పులు, షుగర్, గుండె జబ్బులతో ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గితేనే ఆరోగ్యం చేకూరుతుందని వారు సూచిస్తున్నారు.
స్నానం చేసే ముందు నువ్వుల నూనెను పొట్టపై రాసుకుంటే పొట్ట తగ్గిపోతుంది. ఉదయం పరగడుపున రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. ఆపై నువ్వుల నూనెను పొట్టపై రాసి 15 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
నువ్వుల నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం ద్వారా బీపీ కంట్రోల్ అవుతుంది. అందుకే కొవ్వు పేరుకుపోయిన శరీర భాగాలపై నువ్వుల నూనెను రాస్తే కొవ్వు కరిగిపోతుంది. అలాగే నువ్వుల నూనెలో విటమిన్ ఇ, బి ఉండటం వల్ల చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. నువ్వుల నూనె చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా తయారవుతుంది.
సిహెచ్
Publish Date: Tue, 22 Feb 2022 (23:47 IST)
Updated Date: Wed, 23 Feb 2022 (22:40 IST)