Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నువ్వుల నూనె, ఉప్పు కలిపి కాచి ఆ మిశ్రమాన్ని...

నువ్వుల నూనె, ఉప్పు కలిపి కాచి ఆ మిశ్రమాన్ని...
, బుధవారం, 21 ఏప్రియల్ 2021 (16:02 IST)
సైంధవ లవణమును బి.పి గల వారు కూడా కొద్ది మోతాదులో వాడవచ్చును. ఉప్పు ఆకలిని కలిగించును. ఆహారమును జీర్ణం చేయును. చలువ జేయును. కళ్ళకు చాలా మంచిది.
 
వాము, ఉప్పు కలిపి తింటే కడుపునొప్పి అజీర్తి తగ్గిపోతాయి. ఉప్పును బాగా వేయించి కాపు పెడితే కీళ్ళ నొప్పులు, బెణుకులు, వాపు, దెబ్బల వల్ల కలిగిన నొప్పులు నడుం నొప్పి తగ్గిపోతాయి. ఎండా కాలంలో వడదెబ్బ తగిలి శోష వచ్చినప్పుడు విరేచనాలు, వాంతులు యెక్కువై శోష వచ్చినప్పుడు వేడినీళ్ళలో ఉప్పు, పంచదార కలిపి త్రాగిస్తే తక్షణ ఫలితం లభిస్తుంది. నెయ్యి, ఉప్పు కలిపి వేడినీళ్లలో త్రాగిస్తే భోజనం చేయగనే వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది. 
 
ఉపప్పు నీటిని పుక్కిలి బడితే నోటిలో పుండ్లు పంటిపోటు తగ్గుతుంది. ఉప్పును వేసి బాగా కాగనిచ్చి చల్లార్చి ఆ నీటితో పుండును కడిగితతే నీరును లాగేసి పుండు త్వరగా మానిపోతుంది. కండ్ల కలక వచ్చినప్పుడు కంట్లో కాస్త ఉప్పు నీరు వేసి కడిగితే కంటి వాపు తగ్గిపోతుంది.  ఉప్పు, మిరియాలు కలిపి నూరి పండ్లు తోముకుంటే దంతాలు పుచ్చకుండా దృఢంగా పెరుగుతాయి. ఉప్పు కలిపిన నీటితో తలస్నానము చేస్తుంటే చుండ్రు నివారణమై తలవెంట్రుకలు రాలటం తగ్గుతుంది. 
 
ఒక చెంచా ఉప్పు, కొద్దిగా నీరు అంతే నువ్వుల నూనె, కలిపి నీరంతా ఆవిరైపోయే వరకు మరగకాచి మిగిలిన మిశ్రమాన్ని గజ్జి, దురద, పగుల్ళు లాంటి చర్మవ్యాధులకు పూత మందుగా వాడవచ్చును. ఉప్పు, లవంగము కలిపి చప్పరిస్తుంటే పొడి దగ్గు, ఆయాసము, తగ్గటమే కాకుండా నోటి దుర్వాసన కూడా పోతుంది. ఐతే బిపి వున్నవారు ఉప్పుతో వున్నవాటిని వాడకూడదన్నది వైద్యుల మాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డీహైడ్రేషన్‌తో పాటు బరువును తగ్గించే సబ్జా గింజలు.. ఎలా?