Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గణేశ చతుర్థి.. సకల దేవతలకు ఆయనే ప్రభువు.. మహాభారతాన్ని..?

గణేశ చతుర్థి.. సకల దేవతలకు ఆయనే ప్రభువు.. మహాభారతాన్ని..?
, గురువారం, 9 సెప్టెంబరు 2021 (19:48 IST)
గణేశ చతుర్థిని భాద్రపద శుక్లపక్ష చవితి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 10 శుక్రవారం నాడు రానుంది. చవితి తిథి ముందు రోజు 12.18 గంటల నుంచి సెప్టెంబరు 10 రాత్రి 09.58 గంటల వరకు ఉంటుంది. చవితి నాడు పూజ ఉదయం 11.03 గంటల నుంచి మధ్యాహ్నం 01.33 గంటల మధ్య జరుపుకోవాలి. ఈ రోజు విఘ్నేశ్వరుడిని పూజించడం వల్ల అడ్డంకులన్నీ తొలుగుతాయని, అనుకున్న కార్యంలో విజయం సాధిస్తారని భక్తులు విశ్వసిస్తారు.
 
భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడు పుట్టిన రోజని కొందరు, గణాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు భావిస్తారు. మహేశ్వరాది దేవతా గణాలకు గణపతి ప్రభువు. అంటే సకలదేవతలకు ఆయనే ప్రభువన్న మాట. బ్రహ్మ తొలుత సృష్టి కార్యాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించినట్టు రుగ్వేదం చెబుతోంది. బ్రహ్మవైవర్తన పురాణంలో 'గణ' శబ్ధానికి విజ్ఞానమని, 'ణ' అంటే తేజస్సు అని పేర్కొన్నారు. 
 
ఇక పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు తన లేఖకుడిగా గణపతిని నియమించాడు. గణనాథుడు జయకావ్యాన్ని అద్భుతంగా రాయడంతో దానిని తమ దగ్గరే ఉంచుకోవాలని దేవతలు తస్కరించారంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-09-2021 గురువారం దినఫలాలు - సాయిబాబా గుడిలో అన్నదానం...