Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెడ్‌రూమ్‌‍లలో వాస్తు సరిగ్గా ఉన్నట్టయితే...?

Advertiesment
బెడ్‌రూమ్‌‍లలో వాస్తు సరిగ్గా ఉన్నట్టయితే...?
, సోమవారం, 1 ఏప్రియల్ 2019 (13:05 IST)
జీవతం అంటే ప్రశాంతంగా ఉండాలి. కానీ, అదే జీవితంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటే.. అందుకు ముఖ్య కారణం గృహం. అలానే సంబంధాల్లో సామరస్యతతో పాటు శాంతి పొందడానికి పడకగది కొరకు వాస్తు చిట్కాలను విధిగా పాటించాలి. అలానే పడకగదిలో సంబంధాలు పెంపొందించడానికి వాస్తును ఎంతో జాగ్రత్తగా పరిశీలించాలి. 
 
పాతరోజుల్లో ఫర్నిచర్, ఇతర వస్తువులను ఇంట్లో పెట్టేందుకు తగిన స్థలం ఉండేది. అయితే నేడు ఇళ్లు చిన్నవిగా ఉండడం వలన గందరగోళ పరిస్థితి నెలకొంది. నగరాలు, పట్టణాల్లో ఉండే ఇళ్లకు ఇది అధికంగా వర్తిస్తుంది. పరిశుద్ధమైన బెడ్‌రూమ్‌లు సానుకూల శక్తి ప్రవహించడానికి దోహదపడుతాయి. బెడ్‌రూమ్‌‍లలో వాస్తు సరిగ్గా ఉన్నట్టయితే ఇది జంటల మధ్య చక్కని సంబంధాన్ని కొనసాగించడానికి దోహదపడుతుంది.
 
వాస్తుశాస్త్రం ప్రకారం.. బెడ్‌రూమ్‌లలో అక్వేరియంను పెట్టడాన్ని పరిహరించాలి. అక్వేరియంలోని చేపలను చూడడం వలన ఉపశమనం లభించినప్పటికీ, అందుకు బెడ్‌రూమ్‌‍లో ఉండడం వలన జీవితభాగస్వాముల మధ్య ఆందోళన పెరగడానికి కారణం అవ్వగలదు.
 
నీటి పోస్టర్లను బెడ్‌రూమ్‌లో ఉంచరాదు. నిపుణుల ద్వారా బెడ్‌రూమ్‌లలో ఉంచదగ్గ పోస్టర్ల గురించి తెలుసుకుంటే మంచిది. బెడ్ యొక్క ఆకారం క్రమంగా ఉండాలి. అనుచిత్తమయిన సైజుల్లో బెడ్ ఉండడం వల వ్యక్తుల నిద్రపై ప్రభావం చూపుతుంది. అయితే దాని చుట్టూ ఉండే ఫర్నిచర్ స్థానంపై కూడా ఇది ప్రభావం చూపుతుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏంటి? శ్రీవారి హుండీలో ఒక్క రూపాయ్ కూడా వేయకూడదా? చెప్పిందెవరు?