Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీ రెండు కాళ్ల మధ్య ఏముంది? మహిళా ఐఏఎస్ అభ్యర్థినికి షాకింగ్ ప్రశ్న

Advertiesment
నీ రెండు కాళ్ల మధ్య ఏముంది? మహిళా ఐఏఎస్ అభ్యర్థినికి షాకింగ్ ప్రశ్న
, గురువారం, 21 మార్చి 2019 (17:31 IST)
ఐఏఎస్, ఐపీఎస్ ఉత్తీర్ణులవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో మేధస్సు వుంటే తప్ప ఆ పరీక్షల నుంచి గట్టెక్కే పరిస్థితి వుండదు. పరీక్షలు ఉత్తీర్ణులైనప్పటికీ ఇంటర్వ్యూల్లో గట్టెక్కడం సాధ్యపడదు. అందుకే లక్షల్లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకుని పరీక్షలు రాసినా ఏదో వెళ్లమీద లెక్కించేంత మంది మాత్రమే ఎంపిక కాబడతారు. ఐఏఎస్ అంటే అంతేమరి.
 
ఇక అసలు విషయానికి వస్తే... తాజాగా ఓ మహిళా అభ్యర్థి అన్ని పరీక్షలు దాటుకుని ముఖాముఖి ఇంటర్వ్యూ వరకూ వెళ్లింది. ఈ క్రమంలో సీనియర్ అధికారులు ఆమెకు వరుసబెట్టి ప్రశ్నాస్త్రాలు సంధించారు. వాటన్నిటికీ ఆమె చకచకా జవాబులు చెప్పేశారు. కానీ ఓ అధికారి అడిగిన ప్రశ్న షాకింగ్ కు గురిచేసేలా చేసింది. అదేమిటంటే... నీ రెండు కాళ్ల మధ్య ఏముంది... అంటూ అడిగిన ప్రశ్న. 
 
ఆయన అలా అడిగేసరికి తోటి అధికారులు కూడా షాక్ తిన్నారు. ఐతే మహిళా అభ్యర్థి మాత్రం ఎలాంటి తొట్రుపాటు లేకుండా ఇలా చెప్పింది. ఓ సీనియర్ అధికారి అయిన మీరు కానీ, ప్రశ్నలడుగుతున్న తోటి అధికారులతో పాటు ఐఏఎస్ ఉత్తీర్ణురాలిని కావాలన్న ఆశతో ఎంతో ఆరాటపడుతున్న నేను కానీ అంతా అక్కడి నుంచే వచ్చినవాళ్లమేనండీ. 
 
అదే ఈ మానవ సృష్టికి మూలాధారం అంటూ చెప్పగానే ప్రశ్న అడిగిన అధికారితో పాటు అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టి ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమెను ఐఏఎస్ వరించింది. నిజానికి ఇలాంటి ప్రశ్న ఎదురయితే చాలామంది మహిళలు అవతలివారి దవడ పగులగొడతారు.  కానీ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యేవారి మానసిక స్థితి సాధారణ మానవులను దాటి వుంటుంది. వుండాలి కూడా. అందుకే వారు ఐఏఎస్ అవుతారు. సెల్యూట్ దెమ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారా లోకేష్ చెప్పినట్లు ఏప్రిల్ 9న టీడీపీకి ఓటేయండి.. వైకాపాకు మాత్రం?