Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలెక్టర్ భార్యకు అశ్లీల మెసేజ్‌లు.. భర్త రియల్ హీరో అంటూ..

Advertiesment
కలెక్టర్ భార్యకు అశ్లీల మెసేజ్‌లు.. భర్త రియల్ హీరో అంటూ..
, మంగళవారం, 8 జనవరి 2019 (14:49 IST)
కలెక్టర్ భార్యకు అశ్లీల మెసేజ్ పంపిన యువకుడిని చితక్కొట్టారు. వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన అలిపూర్‌ద్వర్ జిల్లాకు నిగిల్ నిర్మల్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇతని భార్య నందిని కృష్ణన్‌కు ఓ యువకుడు అనేక సార్లు అశ్లీల మెసేజ్‌లు పంపాడు. ఈ ఘటనపై నిగిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న ఐఏఎస్ అధికారి.. పోలీస్ స్టేషన్‌కు భార్యతో కలిసి వెళ్లారు. పోలీస్ స్టేషన్‌లో యువకుడిని చితక్కొట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో లీక్ కావడంతో కలెక్టర్ సస్పెండ్ అయ్యారు. తన భర్త రియల్ హీరో అంటూ.. తనకు అశ్లీల మెసేజ్‌లు పంపిన యువకుడిపై దాడి చేసిన వీడియోను నిగిల్ భార్య ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో.. ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ గోల్డ్ మెసేజ్.. ఓపెన్ చేశారో... 10 సెకన్లలో ఫోన్ మటాష్