Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్ణాటకలో శాఖల చిచ్చు.... కుమారస్వామిపై మంత్రుల గుర్రు

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీ(ఎస్‌) సంకీర్ణానికి రోజుకో చిక్కువచ్చిపడుతోంది. మంత్రి పదవులు రాలేదంటూ అనేకమంది సీనియర్లు మండిపడుతుండగా... పదవులు దక్కినవారేమో తమకు మంచి శాఖలు కేటాయించలేదంటూ భగ్గుమంటున్నారు.

కర్ణాటకలో శాఖల చిచ్చు.... కుమారస్వామిపై మంత్రుల గుర్రు
, ఆదివారం, 10 జూన్ 2018 (10:07 IST)
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీ(ఎస్‌) సంకీర్ణానికి రోజుకో చిక్కువచ్చిపడుతోంది. మంత్రి పదవులు రాలేదంటూ అనేకమంది సీనియర్లు మండిపడుతుండగా... పదవులు దక్కినవారేమో తమకు మంచి శాఖలు కేటాయించలేదంటూ భగ్గుమంటున్నారు. మంత్రులకు శనివారం శాఖలు కేటాయించారు. సీఎం కుమారస్వామి ఆర్థిక, విద్యుత్‌ సహా 11 శాఖలు అట్టిపెట్టుకున్నారు.
 
విద్యుత్‌ శాఖ కోసం పట్టుబట్టిన డి.కె.శివకుమార్‌కు భారీ, మధ్య తరహా నీటిపారుదల, వైద్య విద్య శాఖలు దక్కాయి. విద్యుత్‌తో పాటు ప్రజాపనుల శాఖ కావాలని కుమారస్వామి అన్న హెచ్‌డీ రేవణ్ణ భీష్మించుకోగా.. చివరకు ప్రజాపనులను మాత్రమే ఆయనకు అప్పగించారు. జేడీఎస్‌ నుంచి వచ్చిన ఖాన్‌కు రెండు కీలక శాఖలు కట్టబెట్టడంపై కాంగ్రెస్‌ మంత్రులు గుర్రుగా ఉన్నారు. సిద్ధరామయ్యను చాముండేశ్వరిలో ఓడించిన జీటీ దేవెగౌడ చదువుకున్నది 8వ తరగతి మాత్రమే.
 
ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వరకు కీలకమైన హోంతో పాటు బెంగళూరు అభివృద్ధి శాఖ, యువజన సర్వీసుల శాఖను కట్టబెట్టారు. ఆయనకు హోం మాత్రమే ఉంచి మిగిలినవి తమకు పంచాలని మంత్రిపదవులు దక్కని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక విద్యుత్‌ శాఖ కోసం పట్టుబట్టిన డి.కె.శివకుమార్‌కు భారీ, మధ్య తరహా నీటిపారుదల, వైద్య విద్య శాఖలు దక్కాయి. 
 
కానీ... ఆయనకు ఉన్నత విద్యను అప్పగించారు. దీనిపై ఆయనే గుర్రుగా ఉన్నారు. మొత్తంగా కాంగ్రెస్‌ మంత్రుల్లోనే ఎక్కువ మంది శాఖల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి కాదు... తనకు ఉపముఖ్యమంత్రి పదవే ఇవ్వాలంటున్న సీనియర్‌ నేత ఎంబీ పాటిల్‌తో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఢిల్లీలో సమావేశమయ్యారు. 
 
కర్ణాటకలో కాంగ్రెస్‌ బలోపేతానికి తాను చేసిన కృషిని వివరించారు. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు 22 మంత్రి పదవులు ఉన్నాయి. ప్రతి రెండేళ్లకు 22 మంది చొప్పున ఐదేళ్లలో 66 మందిని మంత్రులను చేయొచ్చన్నదిదాని సారాంశం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ... ఎలా?