ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు నారా లోకేష్. ''శవాలపై పేలాలు ఏరుకునేవారిని తలదన్నుతూ అత్యాచారాలపైనా కోట్లు దండుకుంటున్నారు జగన్‌రెడ్డి. తన ఇంటి పక్కనే గ్యాంగ్ రేప్ జరిగి 10 రోజులవుతున్నా నిందితుల్ని పట్టుకోని జగన్‌రెడ్డి ప్రభుత్వం.
దిశ యాప్ డౌన్‌లోడ్ నెపంతో సొంత పత్రికకు కోట్ల రూపాయల ప్రకటనలిచ్చారు. సొంత అక్కాచెల్లెళ్లు షర్మిల, సునీతలకే భద్రతలేక ఒకరు తెలంగాణలో, ఇంకొకరు పోలీసుల చుట్టూ తిరుగుతుంటే.. ``అక్కచెల్లెమ్మల భద్రత-జగనన్న ప్రభుత్వ బాధ్యత`` అంటూ ఎందుకీ కపట ప్రకటనలు జగన్‌రెడ్డీ!
మీ ఇంటి పక్కనే గ్యాంగ్ రేప్ జరిగితే, నిందితుడూ మీ ఇంటిచుట్టూ తిరుగుతుంటే పట్టుకోలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రీ... కరోనా బాధితుల డిమాండ్ల సాధనకు చంద్రబాబు చేపట్టిన దీక్షని పక్కదారి పట్టించేందుకు, 2020లో ఆమోదం పొందని దిశ చట్టం కోసం అప్పుడే ఆరంభించిన యాప్‌కే మరోసారి డౌన్లోడ్ కార్యక్రమమా?''