Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముత్య‌పు పందిరి వాహనంపై కాళీయ‌మ‌ర్ధ‌న చిన్నికృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

Advertiesment
ముత్య‌పు పందిరి వాహనంపై కాళీయ‌మ‌ర్ధ‌న చిన్నికృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప
, సోమవారం, 21 సెప్టెంబరు 2020 (20:20 IST)
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమ‌వారం రాత్రి 7 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ‌ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు కాళీయ‌మ‌ర్ధ‌న చిన్నికృష్ణుడి అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై దర్శనమిచ్చారు.
 
ముత్య‌పు పందిరి - స‌క‌ల సౌభాగ్య సిద్ధి
ముత్యాల నిర్మల కాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్పకు మూడోరోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది.
 
ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు - రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.
 
వాహనసేవల‌లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు శ్రీ డిపి.అనంత‌, శ్రీ శివ‌కుమార్‌, శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుమ‌ల పూర్వ‌పు జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్ పాల్గొన్నారు.
 
 కాగా, బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన మంగ‌ళ‌‌‌వారం ఉదయం 9 గంటలకు క‌ల్ప‌వృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు స‌ర్వ‌భూపాల‌ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరల్డ్ ఫాసెస్ట్ హ్యుమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను ప్రకాష్‌తో నాట్స్ వెబినార్