Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

Advertiesment
War 2 teser poster

దేవీ

, మంగళవారం, 20 మే 2025 (12:09 IST)
War 2 teser poster
హృతిక్ రోష‌న్‌ చెప్పినట్లే నేడు ఎన్.టి.ఆర్. పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితమే తాజా అప్ డేట్ ఇచ్చారు. వార్ 2 టీజర్ ను మూడు బాషల్లో సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ పవర్‌ ఫుల్‌గా కనిపించారు.  నా కళ్ళు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతున్నాయ్ కబీర్. ఇండియాలో బెస్ట్ రా ఏజెంట్ నువ్వే. కానీ ఇప్పుడు కాదు. నీకు నా గురించి తెలీదు. ఇప్పుడు తెలుసుకుంటావ్‌  ‘గెట్‌ రెడీ ఫర్‌ ద వార్‌’ అంటూ ఎన్టీఆర్‌ డైలాగ్‌, యాక్షన్‌ సన్నివేశాలతో ఉన్న ఈ టీజర్‌ ఆకట్టుకుంటోంది.
 
1 నిమిషం 34 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌ను సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ X (గతంలో ట్విట్టర్)లో షేర్ చేశారు, జూనియర్ ఎన్టీఆర్‌ను ఫ్రాంచైజీకి స్వాగతించారు. తెరపై కబీర్ పాత్రకు కట్టుబడి, హృతిక్ జూనియర్ ఎన్టీఆర్‌కు సవాలుతో కూడిన స్వాగతం పలికారు, "అలాగే ఇది ప్రారంభమవుతుంది, @tarak9999. సిద్ధంగా ఉండండి, దయకు చోటు లేదు. నరకానికి స్వాగతం. ప్రేమ, కబీర్. #War2teaser #War2" అని రాశారు.
 
టీజర్ ను బట్టి ఇది ఇండియాలోని రా ఏజెంట్ మధ్య వార్ లా అనిపిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి రాబోతుంది. ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్‌ కలయికతో టీజర్ లోనే అందరినీ ఆకట్టుకునేలా చేశారు. ఇందులో ఎన్.టి.ఆర్. పాత్ర డిజైన్ కూడా పవర్ ఫుల్ గా దర్శకుడు తీర్చిదిద్దారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు నిర్మాత ఆదిత్య చోప్రా. కియారా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల