Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

నటసింహ బాలకృష్ణ ఆవిష్క‌రించిన జెట్టి ట్రైలర్

Advertiesment
Nandita Shweta
, గురువారం, 21 అక్టోబరు 2021 (17:51 IST)
Balakrishna -Jeggy trailer
నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "జెట్టి". తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న "జెట్టి" సినిమా  ట్రైలర్ ను నటసింహం బాలకృష్ణ విడుదల చేశారు. ట్రైలర్ బాగుందన్న ఆయన..చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. 
 
"జెట్టి" ట్రైలర్ చూస్తే, నా ఆశ కంటే మా నాన్న ఆశయం ముఖ్యం హీరోయిన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఊరికి జెట్టిని తీసుకురావాలనే తండ్రి ఆశయాన్ని సాధించేందుకు కూతురుగా రాజీలేని పోరాటం చేస్తుంది. జెట్టి వల్ల పర్యాటకం పెరిగి ఊరు బాగుపడుతుంది. జనం బాగుపడటం ఇష్టంలేని విలన్లు జెట్టి కాదు కదా మట్టిని కూడా తీసుకురానివ్వం అంటూ అడ్డుపడుతుంటారు. హీరో మాన్యం కృష్ణ మాన్యం అనే పాత్రలో నటించారు. అతని సహాయంతో ఈ ప్రతినాయకుల స్వార్థాన్ని నాయిక ఎలా ఎదుర్కొంది, వీళ్లంతా ఊరికి జెట్టిని తీసుకొచ్చారా లేదా అనేది ఆసక్తికరంగా ఉండబోతోంది. సినిమా మత్స్యకార జీవనం, స్థితిగతులు, వారి జీవనంలోని భావోద్వేగాలను సహజంగా చూపించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
 
ఈ సందర్భంగా నిర్మాత వేణు మాధవ్ మాట్లాడుతూ, మా "జెట్టి" సినిమా ట్రైలర్ ను నటసింహం బాలకృష్ణ గారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఆయన ట్రైలర్ చూసి బాగుందని ప్రశంసించడం ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మా యూనిట్ అందరి తరుపున బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఓ మత్య్సకార గ్రామంలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకుని "జెట్టి" సినిమాను నిర్మించాం. మత్య్సకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను, ఇప్పటి వరకూ వెండితెరమీద కనిపించని జీవితాలను చక్కగా చిత్రీకరించారు మా దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక. త్వరలోనే థియేటర్ లలో "జెట్టి" సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.
 
నటీ నటులు : నందిత శ్వేత‌, మాన్యం కృష్ణ , క‌న్న‌డ కిషోర్, మైమ్ గోపి,  ఎమ్ య‌స్ చౌద‌రి, శివాజీరాజా, జీవా, సుమ‌న్ షెట్టి తదితరులు
 
సాంకేతిక నిపుణులు : బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్, మ్యూజిక్ :  కార్తిక్ కొండ‌కండ్ల‌, డిఓపి:  వీర‌మ‌ణి, ఆర్ట్ ః ఉపేంద్ర రెడ్డి, ఎడిటర్:  శ్రీనివాస్ తోట‌, స్టంట్స్: దేవరాజ్ నునె, కోరియోగ్రాఫర్ : అనీష్, పబ్లిసిటీ డిజైనర్:  సుధీర్, డైలాగ్స్ ః శ‌శిధ‌ర్, పిఆర్ ఓ : జియస్ కె మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః పండ్రాజు శంక‌ర్రావు , నిర్మాత ః వేణు మాధ‌వ్,  క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ ః సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎఫ్ 3 షూటింగ్ లో జాయిన్ అయిన సోనాల్ చౌహాన్