Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నమాచార్య సాహిత్యంతో కలకత్తా కె శ్రీవిద్య, సోదరుడు మోహన్ కణ్ణన్‌తో కలిసి భజన-గోవింద నందనందన

Advertiesment
image
, గురువారం, 31 ఆగస్టు 2023 (16:12 IST)
రక్షాబంధన్ సందర్భంగా ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, కలకత్తా కె శ్రీవిద్య తన సోదరుడు, సంగీత స్వరకర్త-గాయకుడు మోహన్ కణ్ణన్(అగ్నీ)తో కలిసి వారి తాజా గోవింద నందనందన అనే భజన అందించారు. శ్రీవిద్య ఆలపించిన గోవింద నందనందనుడు భజన శ్రీకృష్ణుని ఆవాహన చేస్తుంది. ఇది గోపిక కన్నుల ద్వారా భగవంతుని గురించి మాట్లాడుతుంది. శ్రీకృష్ణుడు బాల్యం, యవ్వనంలో ఎలా వుండేవాడో ఒక ఉల్లాసభరితమైన భజన ద్వారా తెలుపుతుంది. శ్రీవిద్య తాళ్లపాక అన్నమాచార్య సాహిత్యం ద్వారా గోవింద నందనందనతో మొదటిసారిగా తన స్వరకర్త భూమికను నిర్వహించింది.
 
కలకత్తా కె శ్రీవిద్యగా పిలువబడే శ్రీవిద్య అత్యంత ప్రశంసలు పొందిన కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాత్రం మరియు వయోలిన్ రెండింటిలోనూ ఈమె నిష్ణాతులు. ఆమె తన తల్లి, గురువు శ్రీమతి వసంత కణ్ణన్ నుండి సంగీతం నేర్చుకున్నారు. వసంత కణ్ణన్, ప్రపంచ ప్రఖ్యాత కర్నాటక వయోలిన్ విద్వాంసురాలు.
 
ఈ భజన శ్రావ్యతతో, శాస్త్రీయంగా వుండటమే కాక నూతన తరం శబ్దాలను కూడా అడ్డంకులు లేని పద్ధతిలో మిళిత చేస్తుంది. శ్రీవిద్య కంపోజిషన్ చేస్తూ గాత్రంలో ప్రధాన భాగాన్ని అందించగా, ఆమె సోదరుడు మోహన్ ఒక స్వరం ఆలపించారు. ఇది పాటపై సాంప్రదాయేతర సంగీత విభాగాన్ని అందించింది. ఇందులో తబలా ప్రధాన భూమిక పోషించింది. 
 
కోల్ కతా లోని శ్రీ గురువాయురప్పన్ ఆలయంలో ఇది శ్రీవిద్య శ్రీకృష్ణునికి పాడే నిర్మలమైన దృశ్యాలతో ఆత్మను హత్తుకునే భక్తిగీతం. ఈ మ్యూజిక్ వీడియో సహజమైన శ్రీ గురువాయూరప్పన్ ఆలయం యొక్క అందాన్ని ప్రదర్శిస్తుంది. 
 
webdunia
సంగీత స్వరకర్త, గాయకురాలు శ్రీవిద్య గోవింద నందనందన భజనకు జీవం పోయడం గురించి మాట్లాడుతూ... ఇది భజనలో చాలా సరదాగా వుంటుంది. ఇది చాలా ప్రత్యేకమైనది. గోవింద నందనందన భజన అనేది నాకు కేవలం పాట మాత్రమే కాదు, దానిని కంపోజ్ చేయడం, పాడటం, షూటింగ్ చేయడం నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నాకు సహాయపడింది. ఈ పాట కోసం నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
 
వీడియో, పాట గురించి శ్రీవిద్య సోదరుడు మోహన్ కణ్ణన్ మాట్లాడుతూ... కోల్ కతా లోని ఈ ఆలయం కేవలం  ఒకే గదిగా వున్నప్పటి నుంచి మా కుటుంబం మొత్తం దానితో అనుబంధం కలిగి వుంది. శ్రీవిద్య ఎల్లప్పడూ ఈ ఆలయం, శ్రీకృష్ణుని పట్ల ప్రత్యేక ప్రేమను, గౌరవాన్ని కలిగి వుంది. ఆమె చెన్నై నుండి కోల్ కతాను సందర్శించిన ప్రతిసారీ, ఎంత తక్కువ సమయం గడిపినప్పటికీ, శ్రీకృష్ణుని ఆశీర్వాదాన్ని పొందడం ఆమెకి తప్పనిసరి. ఇది జరగడానికి తనవంతు కృషి చేసిన శ్రీ వెంకట్రమణన్ మహదేవన్ కు మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఆడియో ముందు, ఆదిత్య పుష్కర్ణ భజన యొక్క సారాంశాన్ని లేదా కూర్పు యొక్క శాస్త్రీయ స్వభావాన్ని వదలకుండా ఆధునిక శబ్దాలను అందంగా మిళితం చేయడంలో ఖచ్చితంగా అద్భుతమైన పనిని చేసారు.
 
7 సంవత్సరాల వయసు నుండి, మోహన్ మరియు శ్రీవిద్య భారతదేశం అంతటా అనేక కర్నాటక్ క్లాసికల్ కచేరీలలో ప్రదర్శించారు. శ్రీవిద్య పాడటం లేదా వయొలిన్ వాయించడం మరియు మోహన్ మృదంగం వాయించడం చేస్తుంటాడు. వారి మొదటి వాణిజ్య స్టూడియో సహకారం 2011లో జాతీయ అవార్డును గెలుచుకున్న మరాఠీ చిత్రం " శాల'' కోసం సదా అనే పాటను కంపోజ్ చేసి పాడారు. సదా 2012లో వీడియో మ్యూజిక్ అవార్డును కూడా గెలుచుకున్నారు. వారు తమ తల్లి వసంత కణ్ణన్ కద్యుత గంటి రాగంలో స్వరపరచిన థిల్లానాకు కూడా సహకరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇన్‌స్టంట్ హైదరాబాదీ స్పాట్ ఇడ్లీ వంటకం.. ఎలా చేయాలి..