ఇటీవలే నాని తన సినిమా శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్‌లోభాగంగా ఎ.పి.లో థియేటర్ల మూత వేయడంపై స్పందించిన తీరుపట్ల పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాని అంతలా రియాక్ట్ కాకుండా వుండాల్సింది. తను అగ్రహీరో కాదు. కాబట్టి ఆచి తూచి అడుగులు వేయాల్సిందని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వెబ్ దునియాతో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంతో యవ్వారం అన్నప్పుడు చాలా ఓపికతో వుండాలి. కాస్త టైం పడుతుంది. మేం ఇప్పటికే పలు సార్లు ప్రభుత్వంతో మాట్లాడాం. త్వరలో మరోసారి చర్చలుకు వెళతాడు. అన్నీ సవ్యంగా జరుగుతాయని తెలిపారు. నాని విషయంపై స్పందిస్తూ, తను కిల్లీకొట్టు కలెక్షన్లతో కంపేర్ చేసి వుండాల్సిందికాదు. తను హీరో మాత్రమే. థియేటర్ల సమస్యల గురించి సినీ పెద్దలు లేదా నిర్మాత చూసుకుంటారని అంటే బాగుండేదని తెలిపారు.