Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ నాలుగో సీజన్ సెంచరీ కొట్టింది.. జర్నీ ర్యాప్ సాంగ్.. కంటెస్టెంట్లతో కేకలు

Advertiesment
Bigg Boss Telugu Season 4
, మంగళవారం, 15 డిశెంబరు 2020 (13:06 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్ సెంచరీ కొట్టింది.. ఎప్పుడూ సినిమా పాటలతో కంటెస్టెంట్లను నిద్రలేపే బిగ్‌బాస్ వంద ఎపిసోడ్‌లో కాస్త డిఫ్రెంట్‌గా ట్రై చేసి కావాల్సినంత కిక్‌ ఇచ్చాడు. బిగ్‌బాస్ జర్నీ ర్యాప్ సాంగ్‌ ప్లే చేసి, కంటెస్టెంట్లతో కేకలు పెట్టించాడు. ర్యాప్‌ సాంగ్‌లో ఇంటిసభ్యుల మాటలు, అరుపులు, ఏడుపులు డిఫ్రెంట్‌ వేరియేషన్‌ను చూపించాయి. రోటీన్‌గా కాకుండా వెరైటీగా వేకప్‌ సాంగ్‌ రావడంతో ఇంటిసభ్యుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. అది కూడా వారి మాటలే మ్యూజిక్‌తో మిక్స్ అయి ప్లే అవుతుండడంతో ఆశ్చర్యపోతూనే ఆగకుండా చిందులేశారు.
 
జర్నీ ర్యాప్‌ సాంగ్‌లో భాగంగా అరియానా అరుపులను ప్లే చేయడంతో హౌసంత గోలగోలగా మారింది. సోహైల్‌ అయితే పడి పడి నవ్వాడు. ఇక అరియానా బిత్తరపోయి చూడాల్సి వచ్చింది. డ్యాన్స్ ఎపిసోడ్‌ తర్వాత అఖిల్‌ విరహవేదన ఎపిసోడ్ నడిచింది. మోనాల్‌ ఎలిమినేట్‌ అవ్వడంతో అఖిల్‌ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆమెను మిస్వవుతున్నానని తెగ ఫీలైపోయాడు. తనలో తాను మాట్లాడుకుంటూ తన ఫీలింగ్స్‌ను బయటపెట్టేశాడు. అంతంటితే ఆగకుండా హారిక దగ్గరకు వెళ్లి బాధవుతుందే మస్తు బాధవుతుందే అంటూ వాపోయాడు. తాను లేకపోతే పిచ్చెక్కుతుందని చెప్పుకచ్చాడు. ఇక హారిక ఏదో అనబోతే టాపిక్‌ డైవర్ట్ చేశాడు అఖిల్.
 
మోనాల్ ఎలిమినేషన్‌తో ఫినాలే వీక్ మొదలైపోయింది. టాప్‌ -5లో నిలిచిన ఫైనలిస్టులల్లో బెస్ట్‌ ఎవరో తేల్చడానికి బిగ్‌బాస్ టాస్క్‌లు మొదలుపెట్టేశాడు. ముసుగు వెనుక దాగింది ఎవరూ అంటూ తొలి టాస్క్‌ ఇచ్చాడు. తనలో తాను దాచుకున్న అంశాన్ని ఎవరూ బయటకుతీశారు. ఏ సందర్భంలో జరిగిందో వివరణ ఇవ్వాల్సి ఉంటుందని బిగ్‌బాస్‌ ఆదేశించాడు.
 
ఈ గేమ్‌కు ముందు కంటెస్టెంట్లకు క్రెజీ డ్రెస్సులు, మాస్కులు పంపించాడు బిగ్‌బాస్ వాటిని ధరించిన ఇంటి సభ్యులు బయటకు రాగానే మ్యూజిక్‌ ప్లే చేశాడు బిగ్‌బాస్. ఇక ఇంటిసభ్యులు కాళ్లు చేతులు ఆగుతాయా ఏదో వాళ్లకు తోచిన నాలుగు స్టెప్పులేసి పర్వాలేదనిపించారు. ముసుగు వెనుక దాగింది ఎవరూ అనే టాస్క్‌లో ఫస్ట్‌ అభిజిత్‌ తన అభిప్రాయాన్ని మిగితా ఇంటిసభ్యులతో పంచుకున్నాడు. నా కోపాన్ని ఇంట్లోకి జంటగా అడుగు పెట్టిన సోహైల్‌, అరియానా బయట పడేలా చేశారని చెప్పుకచ్చాడు.
 
అరియానాకు వంట సూపర్బ్‌గా వచ్చు కానీ వంటగదిలోకి వెళ్తే గొడవలు వస్తున్నాయని వంట రాదని తప్పించుకుందట కానీ అమ్మా రాజశేఖర్‌ వల్ల అందరికీ తెలిసిందని అరియానా వాపోయింది. తనలోని కోపం సోహైల్, అవినాష్ వల్ల బయట పడిందని తన ఓపినీయన్‌ షేర్‌ చేసుకుంది. దివి వల్ల తనలోని అగ్రెసివ్‌ బయటపడిందని సోహైల్‌ ప్రకటించాడు. ఇక అరియానా వల్ల తనకు వంట వచ్చనే విషయం బయటపడిందన్నాడు. అఖిల్‌ నోయల్ వల్ల బిగ్‌బాస్‌ హౌస్‌లో కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పాడు. అభి వల్ల తనకు కోపం కట్టలు తెచ్చుకుందని సోహైల్‌ క్లారిటీ ఇచ్చుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆచార్య సెట్లో కొత్త దంపతులు కాజల్-గౌతమ్, మెగాస్టార్ చిరు ఆశీస్సులు