Viraj Reddy Cheelam, Mimi Linord, Shilpa
విరాజ్ రెడ్డి చీలం కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం గార్డ్. రివెంజ్ ఫర్ లవ్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం థ్రిల్లింగ్ హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ మూవీ ఫిబ్రవరి 28న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ కథానాయికలుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, పాటలతో అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.
తాజాగా గార్డ్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. 12 మంది టాలీవుడ్ ప్రముఖులు కలిసి ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. నటుడు శ్రీకాంత్, సుధీర్ బాబు, నిఖిల్ సిద్ధార్థ్, థమన్, ఓంకార్, తరుణ్, సుశాంత్, ఆది, అశ్విన్ బాబు, సన్నీ వీజే, సామ్రాట్, ప్రిన్స్ ఇలా అందరూ తమ తమ సోషల్ మీడియా ఖాతాలా ద్వారా ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మిస్టీరియస్ యాక్షన్‌తో ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. విరాజ్ రెడ్డి చీలం ఈ చిత్రంలో యాక్షన్, రొమాంటిక్ ఇలా అన్ని రకాల సీన్లలో అదరగొట్టేశాడని అర్థం అవుతోంది. ఈ చిత్రంలో యూత్‌ను ఆకట్టుకునే అంశాలెన్నో ఉన్నాయని తెలుస్తోంది.
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ మూమెంట్స్‌తో ఓ అద్భుతమై హారర్ ఎంటర్‌టైనర్‌గా గార్డ్ రాబోతోంది. మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ గ్లామర్ పార్ట్, ఫ్రెండ్ క్యారెక్టర్‌తో చేయించిన కామెడీ ఇలా అన్నీ కూడా ట్రైలర్‌లో హైలెట్ అవుతున్నాయి. మంచి విజువల్స్‌తో పాటు చిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచేసినట్టు అయింది.
అను ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనసూయ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగ పెద్ది దర్శకుడు. మార్క్ కెన్‌ఫీల్డ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ సదాశివుని సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి రాజ్ మేడ ఎడిటర్ కాగా ప్రణయ్ కాలేరు సంగీతాన్ని అందించారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్దం అయింది. ఈ మూవీని ఫిబ్రవరి 28న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.