Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఏంజెల్' హిట్ ఇస్తుందనే నమ్మకం ఉంది : హెబ్బా పటేల్

తాను నటించిన చిత్రం ఏదైనా సరే ప్లాప్ అయితే ఆ రోజంతా గదిలో కూర్చొని ఏడుస్తానని హీరోయిన్ హెబ్బా పటేల్ అంటోంది. ఈమె ఇటీవల నటించిన చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. ఈ చిత్రం ఊహించని విజయాన్ని సొంతం చేసు

Advertiesment
'ఏంజెల్' హిట్ ఇస్తుందనే నమ్మకం ఉంది : హెబ్బా పటేల్
, బుధవారం, 18 అక్టోబరు 2017 (13:20 IST)
తాను నటించిన చిత్రం ఏదైనా సరే ప్లాప్ అయితే ఆ రోజంతా గదిలో కూర్చొని ఏడుస్తానని హీరోయిన్ హెబ్బా పటేల్ అంటోంది. ఈమె ఇటీవల నటించిన చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. ఈ చిత్రం ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన రెండు చిత్రాలు ప్లాప్ అయ్యాయి. దీంతో హెబ్బా పటేల్ తీవ్ర నిరుత్సాహానికి లోనైంది. ఇపుడు ఓ మంచి హిట్ కోసం పరితపిస్తోంది. ఈ క్రమంలో ఆమె నటించిన చిత్రం ఏంజెల్. త్వరలో రిలీజ్ కానుంది. ఈ చిత్ర హిట్‌ను అందిస్తుందనే నమ్మకంతోనే ఆమె ఉంది. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నిజానికి ప్రతి ఒక్కరూ తాము నటించిన చిత్రం విజయం సాధించాలని కోరుకుంటారన్నారు. కానీ, తాను చేసిన సినిమా ఏదైనా ప్లాప్ అయితే ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఏడుస్తూనే ఉంటానని చెప్పింది. రెండో రోజుకి కొంత తేరుకుంటాననీ, ఎప్పుడూ సక్సెస్‌లు.. పరాజయాలే రావుకదా? అని మనసుకు సర్ది చెప్పుకుంటానని అంది. ఆ తర్వాత నెక్స్ట్ మూవీపై దృష్టి పెడతానని చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ సారైనా చియాన్ విక్రమ్ మసాలా "స్కెచ్" సక్సెస్ అయ్యేనా? (Teaser)