Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్
, బుధవారం, 16 సెప్టెంబరు 2020 (17:58 IST)
ఎంతోమంది సినీ ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు కరోనా సోకగా తాజాగా ప్రముఖ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ వీడియో ద్వారా స్వయంగా వెల్లడించారు.
 
తనకు సెప్టెంబరు 9న కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించిన ఆయన ఈ నెల 22న హోమ్ ఐసోలేషన్ పూర్తవుతుందని వెల్లడించారు. లక్షణాలు కొద్దిగా ఉండడంతో ఇటీవల కరోనా పరీక్షలు చేయించుకున్నానని, అందులో తనకు పాజిటివ్ అని తేలిందని తెలిపారు.
 
ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా తన భిమానులు, సన్నిహితులు, స్నేహితులు కంగారుపడవద్దంటూ, తన ఆరోగ్యం పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగబాబు - బాలయ్య కలిసిపోయారా..?