Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో అధికార పార్టీకి కరోనా వణుకు, మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా

ఏపీలో అధికార పార్టీకి కరోనా వణుకు, మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
, గురువారం, 10 సెప్టెంబరు 2020 (14:19 IST)
ఏపీలో కరోనా మహమ్మారి అందర్ని భయాందోళనకు గురిచేస్తున్నది. సాధారణ ప్రజల నుండి ప్రజా ప్రతినిధులు వరకు దీని బారిన పడుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 5,27,512 కు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా 4,634 మంది మరణించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అధికార పార్టీ నేతలను వణికిస్తోంది.
 
ఇదిలావుండగా తాజాగా వైస్సార్ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా కరోనా సోకింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్ తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడి శెట్టి రాజాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వీరు హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆళ్ల రామకృష్ణా రెడ్డి తండ్రి దశరథ రామకృష్ణా రెడ్డి మృతి చెందారు.
 
ఆయన అంత్యక్రియలకు పాల్గొనడంతో ఆర్‌కెకు కరోనా సోకింది. తన తండ్రి మృతి సమయంలో తనను వచ్చి కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని, అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ విప్ దాడి శెట్టి రాజా చికిత్స తీసుకోవడానికి విశాఖపట్నం వెళ్లినట్టుగా తెలిపారు. ప్రతిపక్ష పార్టీలతో పోల్చుకుంటే అధికార వైసీపీ లోనే పెద్దఎత్తున కేసులు నమోదవుతున్న తీరు అధికార పార్టీ నేతలకు పెద్ద టెన్షన్‌గా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధవాతావరణం.. కొడవళ్ళతో డ్రాగన్ కంట్రీ బుసలు