''తొలిప్రేమ''ను మరిచిపోలేను అంటున్న వరుణ్ తేజ్ (వీడియో)
మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలొచ్చినా.. తొలిసారి ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మరిచిపోలేం అంటూ వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అవునండి.. ఫిదా తర్వాత వరుణ్ తేజ్ సినిమా ''తొలిప్రేమ''. ఈ సినిమ
మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలొచ్చినా.. తొలిసారి ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మరిచిపోలేం అంటూ వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అవునండి.. ఫిదా తర్వాత వరుణ్ తేజ్ సినిమా ''తొలిప్రేమ''. ఈ సినిమా ట్రైలర్‌ను సినీ యూనిట్ విడుదల చేసింది. వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న ''తొలిప్రేమ'' సినిమాకు ఎ జర్నీ ఆఫ్ లవ్ అనేది ఉపశీర్షిక.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. కాగా, ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. వరుణ్ తేజ్ ''తొలిప్రేమ'' సినిమాలో సుహాసిని మణిరత్నం, ప్రియదర్శిని, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఓ లుక్కేయండి..