Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Advertiesment
Murali mphan - Ramakrishna

దేవీ

, శుక్రవారం, 18 జులై 2025 (09:38 IST)
Murali mphan - Ramakrishna
డొక్కా సీతమ్మ ఆంధ్రుల అన్నపూర్ణ అంటారు. దానికి కారణం ఆకలి అని వచ్చిన ఎవరికైనా ఆమె పైసా తీసుకోకుండా ఉచితంగా భోజనం పెట్టి పంపేవారట. స్వయానా ఆమె చేత్తో వంటవండి అతిథి మర్యాదలు చేసేవారట. భోజనానికి సమయం అంటూ ఏ నియమం లేదు. 24 గంటల్లో ఏ సమయంలోనైనా ఎవరైనా వచ్చి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించవచ్చు. ఏపి డిప్యూటి సీయం పవన్‌కల్యాన్‌ గారు అన్న క్యాంటిన్‌లతో పాటు డొక్కా సీతమ్మ మిడ్‌ డే మీల్‌ కూడా పెట్టాలని ప్రభుత్వాన్ని కోరటంతో చాలాకాలం తర్వాత ఆమె పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. 
 
అయితే ఈమె చనిపోయిన 116 సంవత్సరాల తర్వాత ఆమె బయోపిక్‌ రూపంలో సినిమా తీయటానికి పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా, ఈ కథను నాటకంగా వేయడానికి నేనే రాసుకున్నా. ఆ తర్వాత సినిమాగా తీద్దామని మురళీమోహన్, రాజమండ్రిలో నారాయణ అనే వారిని కలిశాను. పుస్తకాలు కూడా ఇచ్చాను. కానీ తన ప్రమేయం లేకుండా సినిమా చేసేస్తున్నారంటూ రచయిత రామక్రిష్ణ వాపోతున్నారు.
 
ఆమె కథను ‘అన్నపూర్ణ డొక్కాసీతమ్మ’ అనే నాటకాన్ని నేను (రామకృష్ణ రాజు) రాశాను. ఇప్పుడు సినిమాగా తీద్దామని అనుకుంటున్న సమయంలో ఆమె కథతో మరొకరు సినిమాగా తీస్తున్నారు. వారు ఆ సినిమాని ఆపేయాలి. ఆమనిగారు డొక్కా సీతమ్మగా మురళీమోహన్‌గారు జోగన్నగా నటిస్తున్నారట. వారు తీసే సినిమా బయటకు రాదు.  ఆమె జీవిత కథపై సర్వహక్కులు నావే అంటూ రామకృష్ణ ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో తెలియచేశారు. ఈ సందర్భంగా ఆమెపై సినిమా తీసే సర్వహక్కులు నావే అంటూ రామకృష్ణ మాట్లాడారు...ఇంకా ఈ సినిమా ఎవరు తీయకూడదంటూ తన వాదనను వినిపించారు.
 
సీతమ్మ గారి వారసులు మిద్దిపాటి నారాయణగారికి నేను కథ ఇచ్చాను. సినిమా స్టోరీగా రాయాలనుకుంటున్నా. వెలుగులోకి తేవాలని వారి అబ్బాయిని అడిగాను. సరే అన్నారు. ఆ తర్వాత సినీమాల్లో కొందరిని కలిశా. సినిమాగా పనికిరాదని చాలామంది అన్నారు. అప్పుడు రెండు ప్రసాదమూర్తి రాజమండ్రిలో నాటకరంగ స్థల దర్శకుడు. వారి అబ్బాయికి ఇచ్చాను. నంది నాటకాల్లో ప్లే చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత మరో నాటకరంగానికి ఇచ్చాం. కాకినాడలో నాటకంలో, పరుచూరి బ్రదర్స్ నాటకాల్లో ఆడారు. మెచ్చుకున్నారు. డొక్కా సీతమ్మ గారి 4వ వారసులు. బుక్ గా వేయించారు.
 
నేను రాసిన పుస్తకాన్ని సినిమాగా చేయడం అనేది తప్పు. సినిమా రైటర్స్ యూనియన్ లో కూడా డొక్కా సీతమ్మ కథను రిజిష్టర్ చేయించాను. కానీ సినిమాగా తీసేవారు నా కథను తస్కరించారని నా అబిప్రాయం. డొక్కా సీతమ్మ అనేవారు ప్రజలకు చెందిన మనిషి. కానీ నేను పదేళ్ళు కష్టపడి రాసుకున్న కథను సినిమా తీయడం నేరమని నా అభిప్రాయం అని తెలిపారు.
 
మేం గతంలోనే మురళీమోహన్ గారితో సినిమా చేయాలని కలిశాం. మీ పుస్తకాలు నాకు ఇవ్వండి అని అడిగారు. నేను రెండు పుస్తకాలు ఇచ్చాను కూడా. ఎట్టిపరిస్థితుల్లో ఈ కథ సినిమాగా రావాలి అని అప్పట్లో అన్నారు. చంద్రబాబునాయుడుగారు కూడా  అప్పట్లో సినిమాగా చేస్తే బాగుండు అని అన్నారు కూడా. కానీ ఇప్పుడు ఎవరో నా కథను సినిమాగా చేయడం అనేది  చాలా దారుణం అని వాపోయారు. దీనిపై మరి మురళీమోహన్, సినిమా నిర్మాతలు ఏమంటారు చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?