Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనం కంటెంట్ ఇస్తేనే టీవీలకు బతుకు.. చానెళ్ళను నిషేధిద్దామా?

క్యాస్టింగ్ కౌచ్‌తో పాటు నటి శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై చర్చోపచర్చలు పెట్టిన టీవీ చానెళ్ళకు చెక్ పెట్టే దిశగా టాలీవుడ్ అగ్రహీరోలు అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా, టీవీ చానెళ్లను పూర్తిగా

మనం కంటెంట్ ఇస్తేనే టీవీలకు బతుకు.. చానెళ్ళను నిషేధిద్దామా?
, బుధవారం, 25 ఏప్రియల్ 2018 (10:42 IST)
క్యాస్టింగ్ కౌచ్‌తో పాటు నటి శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై చర్చోపచర్చలు పెట్టిన టీవీ చానెళ్ళకు చెక్ పెట్టే దిశగా టాలీవుడ్ అగ్రహీరోలు అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా, టీవీ చానెళ్లను పూర్తిగా నిషేధిద్దామనే ఆలోచనలో అగ్రహీరోలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, చిత్ర పరిశ్రమకు చెందిన చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇచ్చే కంటెంట్‌ ఆధారంగానే టీవీలు మనగడ సాగిస్తున్నాయనీ, అందువల్ల అలాంటి కంటెంట్‌ను ఇవ్వకుండా పూర్తిగా నిలిపివేస్తేనే టీవీ చానెళ్లు దారికివస్తాయన్న భావనలో అగ్రహీరోలు ఉన్నట్టు తెలుస్తోంది.
 
నిజానికి గత కొన్ని రోజులుగా తెలుగు చిత్రపరిశ్రమలో గందరగోళ పరిస్థితులు నెలకొనివున్నాయి. లైంగిక వేధింపులు.. కొందరు ప్రముఖులపై ఆరోపణలు.. నిరసనలు వంటి సంఘటనలు తెలుగు చిత్రపరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు దాదాపు 18 మంది హీరోలు, ఇతర సినీ ప్రముఖులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణా స్టూడియోలో సమావేశమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి చొరవ తీసుకుని ఈ భేటీని ఏర్పాటు చేసినట్టు సమాచారం. 
 
ఇందులో అనేక కీలక అంశాలపై చర్చినట్టు తెలుస్తోంది. టీవీచానళ్లు కేవలం సినిమాల మీదే ఆధారపడి బతుకుతున్నాయని, వాటికి కంటెంట్‌ ఇవ్వకూడదని, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, వాటినసలు ప్రోత్సహించకూడదని, టీవీ చానళ్లను బ్యాన్‌ చేయాలని ఈ భేటీలో ఒక ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు మరోమారు సమావేశమే కూలకుశంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. 
 
కాగా, ఈ భేటీకి పవన్ కళ్యాణ్, బాలకృష్ణలు మినహా, చిరంజీవి, నాగార్జు, వెంకటేశ్‌, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, అల్లు అర్జున్‌, రాంచరణ్‌, రామ్‌, నాని, సాయి ధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌ తదితరులతో సహా మొత్తం 18 మంది హీరోలతో పాటు కేఎల్‌ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, జీవిత, రాజశేఖర్‌, మంచు లక్ష్మీప్రసన్న వంటి ప్రముఖులు వచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక దశలో సినిమాలు వద్దనుకున్నానన్న సమంత.. ఏఎన్నార్‌ బయోపిక్‌ రెడీ..