Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

Advertiesment
Soumith Rao, Shreyasi Sen

దేవీ

, సోమవారం, 28 ఏప్రియల్ 2025 (18:47 IST)
Soumith Rao, Shreyasi Sen
సినీ ఇండ‌స్ట్రీలో కొత్తగా ప్రవేశిస్తున్న టీమ్ తో రూపొందించిన చిత్రం  ‘నిల‌వే’. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంట‌గా నటించగా, సౌమిత్ రావు,  సాయి వెన్నం దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై తాహెర్ సినీ టెక్‌తో సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
సోమవారం ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అర్జున్ (సౌమిత్ రావు) అనే వ్యక్తి, తన ఒంటరి జీవితాన్ని కష్టంగా గడుపుతూ ప్రేమ కోసం తాపత్రయ పడుతూ ఉంటాడు. అలాంటి అతని జీవితంలోకి.. శ్రేయాసి సేన్.. ప్రవేశించి అతని జీవితంలో కొత్త కాంతిని తీసుకొస్తుంది. ఇక టీజర్ మొత్తం.. ఆ అమ్మాయి కోసం అతను ఎంత దూరమైనా వెళ్తారు అనేదాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు
 
"నిలవే" టీజర్ నిడివి కేవలం 155 సెకండ్లు మాత్రమే.. అయినప్పటికీ.. ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు. అద్భుతమైన విజువల్స్.. మనసును తాకే సంగీతంతో, ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. ఈ చిత్రంపై అంచనాలను కూడా పెంచేసింది.
 
సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ కెమిస్ట్రీ ఈ సినిమాకి హైలైట్ గా నిలబడింది అని టీషర్ట్ చూస్తేనే అర్థమవుతుంది. వీరితో పాటు హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గోల్లపూడి, అనాల సుశ్మిత మరియు ఇతరులు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి కళ్లాన్ నాయక్ అందించిన సంగీతం మరింత హైలైట్ గా నిలవనుంది. వెంకట్ కొణకండ్ల, సంజనా కృష్ణ ఈ చిత్రానికి సహ నిర్మాతలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్