Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీదేవిది హత్యే.. బాత్‌టబ్‌లో అలా చేసి సాక్ష్యం లేకుండా?: వేదభూషణ్

అందాల నటి శ్రీదేవి దుబాయ్‌లో మృతి చెందిన నేపథ్యంలో ఆమె మృతి సంఘటనలో తాము ఏమాత్రం జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అతిలోకసుందరి మరణంపై అనుమానాలున్నాయని, దీనిపై దర్యాప్తు

శ్రీదేవిది హత్యే.. బాత్‌టబ్‌లో అలా చేసి సాక్ష్యం లేకుండా?: వేదభూషణ్
, శుక్రవారం, 18 మే 2018 (13:42 IST)
అందాల నటి శ్రీదేవి దుబాయ్‌లో మృతి చెందిన నేపథ్యంలో ఆమె మృతి సంఘటనలో తాము ఏమాత్రం జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అతిలోకసుందరి మరణంపై అనుమానాలున్నాయని, దీనిపై దర్యాప్తు చేయాలంటూ దర్శకుడు సునీల్‌సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. 
 
సునీల్ సింగ్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఒమన్‌లో శ్రీదేవి పేరుతో రూ.240 కోట్లకు జీవితబీమా పాలసీ ఉందని, ఒకవేళ ఆమె యూఏఈలో మృతి చెందితేనే ఆ డబ్బును రిలీజ్ చేస్తారని కోర్టుకు తెలిపారు. అయితే శ్రీదేవి మృతి వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 
 
ఇదిలా ఉంటే.. శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్ గదిలో ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపట్ల రిటైర్డ్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ వేద్ భూషణ్ స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టారు. శ్రీదేవి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోలేదని.. ఆమెది హత్యేనని కమిషనర్ వేద్ భూషణ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఢిల్లీ కేంద్రంగా ప్రైవేటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని నిర్వహిస్తున్న వేద భూషణ్.. శ్రీదేవి నీటిలో మునిగి మృతి చెందినట్టు దుబాయ్ అధికారులు తేల్చారు. ఆమె శరీరంలో ఆల్కహాల్ నమూనాలు ఉన్నాయని, నిస్సందేహంగా ఆమె మరణం ప్రమాదవశాత్తూ జరిగిందేనని ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా స్పష్టం చేశారు.
 
అయితే, వీటితో వేద్ భూషణ్ ఏకీభవించడం లేదు. ఎవరినైనా బాత్ టబ్‌లో బలవంతంగా ఊపిరి ఆగిపోయేంత వరకు నిలువరించవచ్చునని తెలిపారు. ఇంకా సాక్ష్యం లేకుండా కూడా చేయొచ్చునని.. అంతటితో ఆగకుండా ప్రమాదవశాత్తు జరిగిందని కూడా చెప్పవచ్చునని.. ఈ వ్యవహారాన్ని బట్టి చూస్తూ ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లుందని వేద భూషణ్ అన్నారు. 
 
తన దర్యాప్తులో భాగంగా శ్రీదేవి మృతి చెందిన దుబాయిలోని హోటల్‌కు వేద్ భూషణ్ వెళ్లి పరిశీలించారు. అయితే శ్రీదేవి బస చేసిన గదిలోకి మాత్రం అనుమతించలేదన్నారు. పక్కగదిలో వుండి ఏం జరిగి వుంటుందనే దానిపై ఓ అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. అయితే శ్రీదేవి మృతి వెనుక కొన్ని శక్తులు పనిచేశాయని.. శ్రీదేవి మృతి పట్ల అనుమానాలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం వుందని వేద భూషణ్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య-ఆరాధ్య.. ఆరాధ్య పెదవులపై ముద్దు.. నెటిజన్లు?