కిడ్నీ తీసుకున్నాడు.. ఇల్లు.. రూ.20లక్షలిస్తానని మోసం చేశాడు.. బాలాజీపై కేసు
సినీ, బుల్లితెర నటుడు బాలాజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూనియర్ ఆర్టిస్ట్‌ను మభ్యపెట్టి కిడ్నీ తీసుకోవడమే కాకుండా ఆమెకు డబ్బు ఇవ్వకుండా మోసగించిన బాలాజీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వ
సినీ, బుల్లితెర నటుడు బాలాజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూనియర్ ఆర్టిస్ట్‌ను మభ్యపెట్టి కిడ్నీ తీసుకోవడమే కాకుండా ఆమెకు డబ్బు ఇవ్వకుండా మోసగించిన బాలాజీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్‌లో బాలాజీ భార్య కృష్ణవేణి, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం కృష్ణవేణి రెండు కిడ్నీలూ చెడిపోయాయి.
కిడ్నీదాత కోసం అన్వేషిస్తున్న సమయంలో యూసు్‌ఫగూడకు చెందిన భాగ్యలక్ష్మి గురించి తెలుసుకున్నాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అనారోగ్యంతో బాధపడుతోంది. కిడ్నీ ఇస్తే కుటుంబాన్ని ఆదుకుంటానని, సినిమా, టీవీలో అవకాశం ఇప్పిస్తానని భాగ్యలక్ష్మికి భరోసా ఇచ్చాడు. ఇల్లు కూడా కొనిస్తానని.. రూ.20లక్షలు చేతిలో పెడతానని, కోలుకునే వరకు నెలకు రూ.15వేలు ఇస్తానని మభ్య పెట్టాడు.
కానీ 2016 ఆగస్టు 26న విజయవాడలోని ఓ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి జరిగాక రూ.1.15 లక్షలు అకౌంట్ ద్వారా జమ చేసి, మరో లక్ష ఖర్చు నిమిత్తం ఇచ్చాడు. తర్వాత భాగ్యలక్ష్మికి డబ్బులివ్వకుడా చేతులెత్తేశాడు. ఈ ఘటనపై సినీనటి శ్రీరెడ్డితో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై మానవ అవయవ మార్పిడి చట్టం కింద, ఐపీసీ 420, 506 సెక్షన్లతో బాలాజీపై పోలీసులు కేసు నమోదు చేశారు.