Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీరెడ్డి కథ ''క్లైమాక్స్''కు వచ్చేసింది.. ఎలాగంటే? (video)

శ్రీరెడ్డి కథ ''క్లైమాక్స్''కు వచ్చేసింది.. ఎలాగంటే? (video)
, సోమవారం, 11 నవంబరు 2019 (14:07 IST)
అవును.. శ్రీరెడ్డి కథ ''క్లైమాక్స్''కు వచ్చేసింది. దక్షిణాది సినీ ఇండస్ట్రీని క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఓ ఆట ఆడుకున్న శ్రీరెడ్డి చివరికి సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. తాజాగా శ్రీరెడ్డి.. "క్లైమాక్స్" అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీరెడ్డి తన నిజ జీవిత పాత్రనే పోషించడం విశేషం. ''డ్రీమ్‌" చిత్రంతో ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు ద‌క్కించుకున్న భ‌వానీ శంక‌ర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
 
ఇందులో డా. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పృథ్వీరాజ్‌, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సాషా సింగ్‌, ర‌మేష్‌, చందు పాత్ర‌లు ప్ర‌ధానంగా ఉంటాయి. పాస్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ప‌తాకంపై పి.రాజేశ్వ‌ర్ రెడ్డి, కె.క‌రుణాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు శ్రీరెడ్డి.. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో కూడా తన నిజ జీవిత పాత్రనే చేస్తున్నట్టు శ్రీరెడ్డి ప్రకటించింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న సమంత, చైతూ దంపతులు.. ఫోటోలు వైరల్