Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

Advertiesment
Kishkindhapuri First Glimpse

దేవీ

, మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (18:35 IST)
Kishkindhapuri First Glimpse
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'కిష్కింధపురి'. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనం సృష్టించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై డైనమిక్, ప్యాషినేట్ సాహు గారపాటి నిర్మిస్తున్నారు, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న కిష్కింధపురి ఒక యూనిక్ ప్రపంచంలో సెట్ చేయబడింది, అద్భుతమైన హర్రర్-మిస్టరీ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
 
ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ఇప్పుడు విడుదలైంది. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ఒక హాంటెడ్ హౌస్ లోకి వెళ్ళడంతో కథ మొదలౌతోంది. "కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు" అని టీజర్ సూచిస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ "అహం మృత్యువు"అనే డైలాగ్ ని ఇంటెన్స్ గా చెప్పే టెర్రిఫిక్ మూమెంట్ లో ట్రైలర్ ముగుస్తుంది.   
 
ఫస్ట్ గ్లింప్స్ స్పైన్ చిల్లింగ్ ప్రివ్యూను అందిస్తుంది. ఈ మాన్సూన్ లో ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. బెల్లంకొండ శ్రీనివాస్ "అహం మృత్యువు" అని ప్రకటించే ఒక అద్భుతమైన మూమెంట్ లో పవర్ ఫుల్ ఇంపాక్ట్ చూపించారు. ఇది వెన్నులో వణుకుపుట్టించి. 
 
ఈ గ్లింప్స్ టెక్నికల్ గా విజువల్ వండర్ గా ఉంది. దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి గ్రిప్పింగ్ కథనం, చిన్మయ్ సలాస్కర్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, సామ్ CS హంటింగ్ స్కోర్‌తో అదిరిపోయింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాణ విలువలు గ్రాండ్‌గా ఉన్నాయి, అతీంద్రియ అంశాల డెప్త్ ని ప్రజెంట్ చేసే VFX వర్క్ టాప్ క్యాలిటీతో ఆకట్టుకుంది.  
 
ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్‌ను మనీషా ఎ దత్ నిర్వహిస్తున్నారు, డి. శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. నిరంజన్ దేవరమానే ఎడిటర్. ఈ ప్రాజెక్ట్ క్రియేటివ్ హెడ్ జి. కనిష్క, సహ రచయిత దరాహాస్ పాలకొల్లు, స్క్రిప్ట్ అసోసియేట్ కె బాల గణేష్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్