Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

Advertiesment
Nabha Natesh Pahalgam shooting

దేవీ

, మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (18:27 IST)
Nabha Natesh Pahalgam shooting
పహాల్గాంలో పర్యాటకులపై  ఉగ్రవాదులు జరిపిన దాడి తన మనసుకు ఎంతో బాధ కలిగించిందని చెప్పింది హీరోయిన్ నభా నటేష్. ఉగ్రదాడులు హేయమైన చర్య అని దేశమంతా బాధితులకు సంఘీభావంగా ఉంటామని నభా పేర్కొంది. అందమైన పహల్గాంలో తాను షూటింగ్ చేశానని, అందమైన అహ్లాదకరమైన ప్రదేశమని నభా నటేష్ తెలిపింది. పహాల్గాంలో షూటింగ్ చేసిన జ్ఞాపకాలను ఆమె షేర్ చేసుకుంది.
 
webdunia
Nabha Natesh Pahalgam shooting
నభా నటేష్ స్పందిస్తూ - పహాల్గాం బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ నేను నటించిన డార్లింగ్ మూవీ షూటింగ్ చేశాం. చుట్టూ 5 కిలోమీటర్ల మేర అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపాం. భూతల స్వర్గమైన పహాల్గాంలో ఉగ్రదాడి జరపడం హేయమైన చర్య. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఇలాంటి దాడులు జరిగాక ఫిలింమేకర్స్ పహాల్గాం వెళ్లాలంటే ఆలోచిస్తారు. స్థానిక ప్రజలు చాలా మంచివారు, మా టీమ్ కు స్నేహితులుగా మారిపోయారు. పహాల్గాం దాడి ఘటన గురించి వినగానే నాకు అక్కడ షూటింగ్ చేసిన రోజులన్నీ కళ్లముందు తిరిగాయి అని చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !