కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఇంటికే సెలెబ్రిటీలు పరిమితమైన సంగతి తెలిసిందే. ప్రముఖులు, సెలెబ్రిటీలు ఇంట్లోనే వుంటూ రకరకాల వీడియోలు పోస్టు చేస్తున్న సంగతి విదితమే. తాజాగా లాక్డౌన్ కారణంగా ఇంటికి పరిమితమైన సూపర్ స్టార్ మహేష్ బాబు క్వారంటైన్ సమయాన్ని తన పిల్లలతో సరదాగా గడుపుతున్నాడు.
ఒకవైపు చిన్నపిల్లాడిలా మారి వారితో గేమ్స్ ఆడడం, మరోవైపు ఇంట్లో రచ్చ రచ్చ చేయడాన్ని ఎప్పటికప్పుడు నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకి తెలియజేస్తుంది.
తాజాగా మహేష్ తన కూతురు సితారతో హెడ్ మాలిష్ చేయించుకుంటున్న ఫోట్ షేర్ చేస్తూ.. గౌతమ్ తన గేమ్ తాను ఆడుకుంటుండగా, మహేష్ హెడ్ మసాజ్ వాలంటీర్ అయ్యాడని పేర్కొంది. రెండు నిమిషాలలో మసాజ్‌ని సితార పూర్తి చేయగా, ఇదే చివరిసారని మహేష్ పేర్కొన్నట్టు నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది.