Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజు పేద తేడా లేదు.. నీ ఆస్తి, డబ్బు నీ వెనుక రావు.. సంపూ

Advertiesment
Sampoornesh Babu
Sampu
బర్నింగ్ స్టార్‌గా ''హృదయ కాలేయం'' సినిమాతో ఒక్కసారిగా దూసుకొచ్చాడు సంపూర్ణేష్ బాబు. ఆ సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు ఇతర సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో తన సొంత ఊళ్లోనే ఉంటున్న సంపూ.. తన భార్య, పిల్లల కోసం నగలు తయారు చేశాడట.
 
ఆ వీడియోను సంపూ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. `రాజు పేద తేడా లేదు.. నీ ఆస్తి, డబ్బు నీ వెనుక రావు.. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు.. అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూ.. నా పాత `కంశాలి` పని ద్వారా నా భార్య కాలికి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేసి ఇచ్చాన`ని సంపూ తెలిపాడు.
 
ఈ మధ్య కరోనా క్రైసిస్‌ చారిటీకి సంపూ రూ. లక్ష రూపాయలు విరాళం అందించారు. అంతే కాదు ఆ మద్య ఏపిలో ప్రకృతి విలయతాండం చేస్తున్న సమయంలోకూడా తన వంతు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సినిమాలోని సీన్ మొత్తం కాపీకొట్టారు.. రాజమౌళికి యువ డైరెక్టర్ కౌంటర్