Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Advertiesment
Sharva as a motorcycle racer

చిత్రాసేన్

, మంగళవారం, 21 అక్టోబరు 2025 (17:20 IST)
Sharva as a motorcycle racer
కథానాయకుడు శర్వా  తన 36వ చిత్రం మోటార్ సైకిల్ రేసర్ పాత్రను పోషిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో  UV క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. దీపావళి సందర్భంగా నిర్మాతలు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. 1990, 2000ల బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం, రేసింగ్ డ్రీమ్స్, ఎమోషన్స్ ,  ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతుంది.
 
ఈ సినిమాకి బైకర్ అనే పర్ఫెక్ట్ టైటిల్‌ను లాక్ చేశారు, ఇది సినిమా నేపథ్యాన్ని సూచిస్తుంది. శర్వా ఇంటెన్స్ బైకర్ డ్రెస్ లో స్పోర్ట్స్ బైక్‌పై కనిపించడం అదిరిపోయింది. తన లుక్ సినిమా యాక్షన్-ప్యాక్డ్ పల్స్‌ ప్రజెంట్ చేస్తోంది.  బోల్డ్ రెడ్ టైటిల్ లోగో ఆకట్టుకుంది. బైకర్ యాక్షన్, ఎమోషన్, నోస్టాల్జియాతోకూడిన గ్రిప్పింగ్ రైడ్‌గా ఉంటుంది.
 
శర్వా సరసన మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తుండగా, బ్రహ్మాజీ,  అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
జె యువరాజ్ సినిమాటోగ్రఫీని, జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు, అనిల్ కుమార్ పి ఎడిటింగ్, రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్. ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు